అంతర్జాతీయం

అధ్యక్ష భవనం పేల్చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యోంగ్‌యాంగ్, మార్చి 27: తమ దేశంపై దాడికి కుట్ర పన్నినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గ్యున్-హై క్షమాపణ చెప్పకపోయినా, తమ నాయకత్వంపై దాడి చేయడానికి పథకాలు వేస్తున్న వారిని బహిరంగంగా ఉరి తీయక పోయినా దక్షిణ కొరియా అధ్యక్ష భవనంపై మిలిటరీ దాడి చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఏటా జరిగే విధంగానే ఇప్పుడు కూడా దక్షిణ కొరియా, అమెరికా సైన్యాల సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి. అయితే ఈ విన్యాసాలు తమపై దాడి చేయడానికి జరుగుతున్న డ్రెస్ రిహార్సల్‌గా ఉత్తర కొరియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా వరసగా ఆ రెండు దేశాలను ఏదో ఒక విధంగా బెదిరిస్తోంది. అందులో భాగంగానే ఈ తాజా బెదిరింపు చేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి నగరంపై అణు దాడి జరిగినట్లుగా చూపించే ఒక వీడియోను ఉత్తర కొరియా ప్రచార వెబ్‌సైట్‌లో ఉంచిన కొద్దిసేపటికే ఈ హెచ్చరిక వెలువడ్డం గమనార్హం. ప్రతి ఏడాది దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంటాయి. అయితే ఈసారి ఈ విన్యాసాలు గతంలో నిర్వహించిన వాటికన్నా చాలా భారీ స్థాయిలో ఉండడం, ఉత్తర కొరియా ఇటీవల అణు పరీక్ష, రాకెట్ ప్రయోగం జరిపిన కొద్దిరోజులకే జరుగుతూ ఉండడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియా అధ్యక్ష భవనం ఉత్తర కొరియా శతఘ్ని దళాల దాడి రేంజి లోపలే ఉన్నదని, దాడి చేయాలని ఆదేశాలు ఇస్తే చాలు ఒక్క సెకనులోనే అది పేలిపోతుందని ఆ హెచ్చరికలో ఉత్తర కొరియా పేర్కొంది. ఎలాంటి హెచ్చరికా లేకుండానే దాడి చేసే సామర్థ్యం తమ శతఘు్నలకు ఉందని, అదే జరిగితే దాదాపు కోటి మంది జనాభా ఉన్న సియోల్ నగరంలో పెద్దఎత్తున ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. అయితే సియోల్‌పై ఉత్తర కొరియా దాడి చేసే అవకాశాలు ఏమాత్రం లేవని, అది ఇంతకుముందు కూడా ఇలాంటి హెచ్చరికలు చాలానే చేసింది కానీ, చర్యమాత్రం తీసుకోలేదని పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉండగా శనివారం ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్‌యాంగ్‌లో ఉద్రిక్తతకు సంబంధించిన సంకేతాలు ఏ మాత్రం కనిపించలేదు. జనం మామూలుగా తమ రోజువారీ పనులకోసం వెళ్లడం కనిపించింది.