జాతీయ వార్తలు

వైవిధ్యం వైషమ్యం కాకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: భిన్నత్వంలో ఏకత్వం, వైవిధ్యమన్నవి భారతీయ ఉదాత్త భావనను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, సమాజంలో వైషమ్యాలకు ఇది ఎంత మాత్రం కారణం కాకూడదని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవన్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల ఉద్దేశాన్ని విస్తృత రీతిలో పరివ్యాప్తం చేసేందుకు చర్యలు చేపట్టిన ఆయన సోమవారం మొదలైన ‘్భవిష్యకా భారత్’అనే మూడు రోజుల కార్యక్రమాన్ని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు. ఆర్‌ఎస్‌ఎస్ పట్ల సరైన అవగాహన కలిగించడమే ఈ సదస్సు ఉద్దేశంగా పేర్కొన్న భగవత్ ఈ సంస్థ మూలాలను, పరిణామ క్రమాన్ని ఈ సందర్భంగా విశే్లషించారు. ఉన్నత ఆశయాలు, భావనలు కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ను మరే సంస్థతోనూ పోల్చడానికి వీల్లేదని, దీని ప్రత్యేకత దీనిదేనని ఉద్ఘాటించారు. ఈ సదస్సుకు రావాలంటూ దాదాపు అన్ని ప్రధాన పార్టీల అధినేతలను ఆహ్వానించినప్పటికీ ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం. అయితే బీజేపీ నేతలు, బాలీవుడ్ నటీనటులు, కళాకారులు, విద్యావేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
భిన్న మతాలు, కులాలు, భాషలు కలిగిన కోట్లాది మందితో ఏకత్వ భావనతో భారత్ విలసిల్లుతోందని, ఈ ఉదాత్తతను గౌరవించడంతో పాటు దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరమూ ఎంతో ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన భగవత్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇటీవల కాలంలో విపక్షాల దాడులు తీవ్రమయ్యాయి. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడమే దీని ఉద్దేశమని, మైనార్టీల దాడులు కూడా ఈ ప్రోద్బలంతో తీవ్రమయ్యాయంటూ కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఈ మూడు రోజుల సదస్సు ప్రారంభం కావడం గమనార్హం.