జాతీయ వార్తలు

భెల్, విశాఖ ఉక్కుకు విశ్వకర్మ పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: కార్మికుల భద్రత ప్రమాద రహితంగా నిర్వహించిన పరిశ్రమల యాజమాన్యాలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ‘జాతీయ భద్రతా అవార్డు’లను అందజేసింది. అలాగే పరిశ్రమలలో అత్యుత్తమ పదర్శన కనబరిచే కార్మికులకు, కార్మిక సమూహలకు ఇచ్చే విశ్వకర్మ జాతీయ అవార్డు (వీఆర్‌సీ)లను సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ అందజేశారు. జాతీయ స్థాయిలో 139 విశ్వకర్మ రాష్ట్రీయ అవార్డులు, 128 జాతీయ భద్రతా అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు, కార్మికులు ఈ అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెట్‌లో పని చేస్తున్న టి.శ్రీనివాస్, పి.విజయ భాస్కర్ గౌడ్, టీ.ముసలి నాయుడు, వై.ప్రవీణ్ కుమార్, జీ.మాణిక్‌రెడ్డి, సిహెచ్.కుమార్, ఆర్.శివ కుమార్, జే.సంగమేశ్వరావు, జే.నర్సింహులు, పి.బీరయ్య, ఎం.శివకుమార్, డి.లక్ష్మణ్, కోటా రాజేష్, అంజన నాగరాజు విశ్వకర్మ అవార్డులను తెలంగాణ నుంచి అందుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పని చేస్తున్న టీ.వీరలింగం, ఎంయూ. సీతారామయ్య, వి.రామన్న, బి.శ్రీరాములు, ఎన్.దయాసాగర్, పట్ట్భిరామన్న, జే.మహారాణా, టీ.విశ్వప్రసాద్, పి.సుబ్బారావు విశ్వకర్మ జాతీయ అవార్డులను అందుకున్నారు.
ప్రమాద రహితంగా నిర్వహించిన పరిశ్రమల యాజమాన్యాలకు ఇచ్చే జాతీయ భద్రత అవార్డులు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు కంపెనీలు అందుకున్నాయి. విశాఖలోని టీజాయ్ ఇండియా ప్రైవెట్ లిమిటెడ్‌కు, తూర్పు గోదావరి జిల్లాలో ప్యారీ సుగర్స్ రిఫైనరీ ఇండియాప్రైవేట్ లిమిటెట్‌కు, ది ఆంధ్రా పెట్రో కెమికల్స్ లిమిటెడ్‌కు రెండు అవార్డులు, కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రోదెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ రెండు అవార్డులు, తెలంగాణలోని జే.కే ఫెన్నర్ ఇండియా లిమిటెడ్ రెండు అవార్డులు, జెఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ రెండు అవార్డులను అందుకున్నాయి.