జాతీయ వార్తలు

సైన్యం అజమాయిషీలోనే పాకిస్తాన్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పడినా ఇంకా సైనిక పాలనే కొనసాగుతోందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఏ మేరకు మార్పులు తీసుకొస్తుందో కొన్నాళ్లు వేచి చూడాలని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం పనితీరుపై భారత్ వేచిచూసే ధోరణితోనే ఉంది’ అని సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా చొరబాట్లు కొనసాగుతునే ఉన్నాయన్న విషయంపై మంత్రిని ప్రశ్నించగా ‘పరిస్థితి మారిపోయిందని మీరు అనుకుంటున్నారా?’ అని ఎదురు ప్రశ్నించారు. ‘ఇప్పటికీ అంతా సైన్యం కనుసన్నలలోనే కొనసాగుతోంది. నాకయితే సైనిక పాలనలాగే తోస్తోంది’ అని మంత్రి వెల్లడించారు. ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందేనని ఆయన అన్నారు. ప్రభుత్వం సైనిక చేతిలోనే ఉంటుందా? ఇమ్రాన్‌ఖాన్ దాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుంటారా అన్నది చూడాల్సిందేనని మీడియాతో అన్నారు. ఫిక్కీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న ‘స్మార్ట్ బోర్డర్ మేనేజ్‌మెంట్’ సదస్సును సింగ్ ప్రారంభించారు. ‘చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానం. అలాంటి సుహృద్భావ వాతావరణం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తాం. ఈ విషయంపై మనకు స్పష్టం ఉంది’ అని మంత్రి తెలిపారు. సిక్కు యాత్రికుల కోసం కర్తార్‌పూర్ సరిహద్దును తెరవనున్నట్టు వచ్చిన వార్తలను మంత్రి దృష్టికి తీసుకురాగా అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని అన్నారు. కొండలు, గుట్టలు, పర్వత శ్రేణులు, మైదాన ప్రాంతాలను కలుపుతూ ఉన్న దేశ సరిహద్దులో చొరబాట్లను కట్టడి చేయడానికి ఒకే విధమైన విధానం అమలు కష్టమని ఆయన అన్నారు. ఈ సదస్సుకు రక్షణశాఖ అధికారులు, సైనిక ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సరిహద్దు ప్రాంతాల గ్రామాల సర్పంచ్‌ల బృందం హాజరైంది.