జాతీయ వార్తలు

‘అర్బన్ నక్సల్స్’పై కఠిన వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ: ‘అర్బన్ నక్సల్’తో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నా వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పోలీసులు ఇటీవల వివిధ పట్టణాల్లో దాడులు జరిపి ఐదుగురు తీవ్రవాద వ్యితిరేక శక్తులను అరెస్టు చేసిన నేపథ్యంలో అప్పటినుంచి అలాంటి వారిని ‘అర్బన్ నక్సల్స్’గా వ్యవహరిస్తున్న వ్యక్తులను ఎదుర్కోవడం చాలెంజ్‌తో కూడుకున్నదైనప్పటికీ ఇలాంటి శక్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని ఆయన తెలిపారు. బీమా-కొరిగాన్‌లో జరిగిన హింసాత్మక ఘటనతో సంబంధం ఉన్న తీవ్రవాదులను అరెస్టు చేసిన విషయాన్ని ఇక్కడి సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించి రెండు పైలెట్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతం, కాశ్మీర్‌లో నక్సలిజం లేదా టెర్రరిజాన్ని సమూలంగా ఎదుర్కొనేందుకు సైనిక, భద్రతా బలగాలు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాయని, ఇందుకోసం ఆయా విభాగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన తెలిపారు. ఈశాన్యంలో ఇప్పటికే ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోయిందని, నక్సలిజం కూడా దాదాపు ఇదే పరిస్థితికి చేరువైందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్మీ, పారామిలటరీ బలగాలు, జమ్మూ-కాశ్మీర్ పోలీసులు టెర్రరిజం, ఉగ్రవాదాన్ని సమూలంగా తుదముట్టించేందుకు సమష్టిగా తమ బాధ్యతలను నెరవేరుస్తున్నాయని ఆయన తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో పాల్గొనండి
జమ్మూ: జమ్మూ-కాశ్మీర్‌లో త్వరలో నిర్వహించే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. జమ్మూ-కాశ్మీర్‌లో నిర్వహించే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) స్పష్టం చేశాయి. ఆర్టికల్ 35ఏపై కట్టుబడి ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వని నేపథ్యంలో ఎన్‌సీ, పీడీపీ పార్టీలు స్థానిక ఎన్నికల్లో పాలుపంచుకునేది లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర మంత్రి మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 1954 నాటి రాష్టప్రతి ఉత్తర్వులు ప్రకారం 35ఏ ఆర్టికల్ కింద జమ్మూ-కాశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉన్నాయని అన్నారు.

చిత్రం..భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దులో ‘స్మార్ట్‌పెన్స్’ ప్రాజెక్టులో భాగంగా సోమవారం మొక్కను నాటుతున్న హోంమంత్రి రాజ్‌నాథ్