జాతీయ వార్తలు

త్వరలో దుతీచంద్ ఆత్మకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: స్టార్ స్ప్రింటర్ దుతీచంద్ ఆత్మకథ సిద్ధమవుతోంది. క్రీడా రంగంలోనూ, తెర వెనుక ఇప్పటి వరకు చోటు చేసుకున్న ఆమెకు సంబంధించిన విశేషాలను వివరిస్తూ వెస్ట్‌ల్యాండ్ బుక్స్ అనే సంస్థ ద్వారా ఓ పుస్తకం వెలువడనుందన్న తీపి కబురు అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. జర్నలిస్టు, రచయిత సందీప్ మిశ్రా ఈ పుస్తక రచన సాగిస్తున్నారు. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి దేశంలోనే అతిపెద్ద స్ప్రింటింగ్ స్టార్‌గా ఆమె ఎదిగిన వైనాన్ని రచయిత సమూలంగా ఆ పుస్తకంలో వివరిస్తారు. వివాదాల్లో చిక్కుకుని ఆ తర్వాత ఆమె ఎలా అందులోంచి మరింత క్లీన్‌గా, శక్తివంతంగా బయటకు వచ్చిందీ ఇందులో వివరిస్తున్నారు. ఓ సాధారణ మహిళ జీవిత పోరాటంలో ఎలా విజయం సాధించిందీ వివరిస్తున్నట్లు రచయిత తెలిపారు. 2014లో అంతర్జాతీయ అథ్లెటిక్ ఫెడరేషన్ (ఇఏఏఎఫ్) ఆమెపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దానిపై ఆమె ఎలా న్యాయ పోరాటం చేసిందీ ఈ పుస్తకంలో వివరిస్తున్నట్లు రచయిత తెలిపారు. వివాదం నుంచి వెలుపలికి వచ్చిన దుతిచంద్ ఆసియా గేమ్స్‌లో వంద మీటర్ల విభాగంలో రజత పతకాన్ని సాధించి పోరాట పటిమ చాటిన సంగతి తెలిసిందే. ఆ పోటీల్లో కేవలం 0.02 సెకన్ల స్వల్ప తేడాతో ఆమె స్వర్ణ పతకాన్ని జారవిడుచుకుంది. అలాగే 200 మీటర్ల ఈవెంట్‌లోనూ అదే టోర్నమెంట్‌లో మరో రజత పతకాన్ని ఆమె గెలుచుకుంది.