జాతీయ వార్తలు

స్వచ్ఛతపై దృఢసంకల్పంతో ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: పరిశుభ్రత (స్వచ్ఛత)పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి ఈ విషయంలో దేశ ప్రజల దృక్పథంలో పూర్తి మార్పును తీసుకువచ్చేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ఈక్రమంలో ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’,‘పద్మన్’ వంటి చలన చిత్రాలు సైతం బాగాప్రభావితం చేస్తుండటం శుభపరిణామన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాఠశాలలకు ‘స్వచ్ఛ విద్యాలయ పురస్కార్’లను మంగళవారం నాడిక్కడి అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆయన అందజేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో పారిశుద్ధ్యం ఓ ఉద్యమంలా మారిందని, పాఠశాలలు, విద్యార్థులు ఈ విషయంలో కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. దేశంలో 6.5 లక్షల పాఠశాలల్లో 52 పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసే విషయంలో చిన్నచిన్న చలన చిత్రాలు సైతం ప్రజాదరణ పొందుతున్నాయని, ప్రజల్లో మారిన మనస్తత్వానికి ఇదో నిదర్శనమన్నారు. పాఠశాలల్లో బాలురకు, బాలికలకు విడివిడిగా మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో 2014లో ‘స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విద్యాలయ’ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో 4.5 లక్షల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని గుర్తించి అక్కడ కేవలం యేడాది కాలంలో మరుగుదొడ్లను నిర్మించి సరికొత్త రికార్డును సృష్టించినట్లు జవదేకర్ వెల్లడించారు. ప్రధాన మంత్రి మోదీ స్వప్న సాకారంగా దేశంలోని 4.5 లక్షల గ్రామాలు, 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 400 జిల్లాలు బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా మారడం దేశంలో వచ్చిన అతిపెద్ద మార్పునకు చిహ్నమని మంత్రి పేర్కొన్నారు. కాగా పురస్కార గ్రహీతల్లో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళకు చెందిన పాఠశాలలు కూడా ఉన్నాయి.