జాతీయ వార్తలు

అసలు రబీ, ఖరీఫ్ అంటే తెలుసా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, సెప్టెంబర్ 18:ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అసలు రబీ, ఖరీఫ్ పంటల గురించి తెలుసో లేదో తనకు సందేహమేనని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాజస్తాన్‌లోని నాగౌర్‌లో మంగళవారం రైతులనుద్దేశించి మాట్లాడిన ఆయన కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నినాదాలు చేయడం బీజేపీ, ప్రధాని మోదీ నైజం కాదని తెలిపారు. కేవలం నినాదాలు, మాటలతో కాలక్షేపం చేయకుండా రైతులకు నిజంగా ప్రయోజనం కలిగించే వాటిపైనే తాము దృష్టి పెడతామని చెప్పారు. కేంద్రంలో భారీ మెజార్టీతో మోదీ ప్రభుత్వం ఏర్పడటంలో రాజస్థాన్ ప్రజలు గణనీయమైన పాత్రను పోషించారని అమిత్ షా అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 25లోక్‌సభ సీట్లను రాజస్ధాన్ నుంచి బీజేపీ గెలుపొందిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. రాజస్థాన్ నుంచి బీజేపీకి అంత భారీ మెజార్టీ రాకపోయి ఉంటే కేంద్రంలో బలహీన ప్రభుత్వమే ఏర్పడి ఉండేదన్నారు. జైజవాన్, జైకిసాన్ నినాద లక్ష్యాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ఆ పార్టీ వల్ల ఇటు దేశానికి, అటు రైతాంగానికీ కూడా ఎలాంటి రక్షణ ఉండదని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే గెలిపించాలని రైతుల్ని అభ్యర్థించిన అమిత్ షా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కృషి చేసి రైతులకు మేలు చేస్తున్నాయని, వ్యవసాయాన్ని లాభదాయకంగా తీర్చిదిద్దేందుకూ ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే తమ లక్ష్యమని, ఆ దిశగానే కృషి చేస్తున్నామని చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ సర్కార్ రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిందని, రబీ, ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం, భూసార పరీక్ష కార్డులు ఇవ్వడం సహా అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. రైతుల పక్షాన నిలువడం బీజేపీ స్వభావమని పేర్కొన్న ఆయన వారి సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం అంకితమైందని చెప్పారు.