జాతీయ వార్తలు

దేశంలో తొలి ఐఏఎస్ అధికారిణి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి , సెప్టెంబర్ 18: దేశంలో తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి అన్నా రాజమ్ మల్హోత్రా(91) తన నివాసంలో కన్నుమూశారు. ముంబయి సబర్బన్‌లోని ఆంధేరీలోని నివాసంలో సోమవారం ఆమె మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చాక ఐఏఎస్‌కు ఎంపికైన తొలి మహిళ ఆమె. నగరంలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. కేరళోని ఎర్నాకుళం జిల్లాలో 1927లో అన్నా రాజమ్ జార్జి జన్మించారు. కోజీకోడ్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసుకున్న తరువాత మద్రాస్‌లోవిశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు చెన్నైకు మకాం మార్చారు. మల్హోత్రా 1951లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆమెను మద్రాస్ కేడర్‌కు కేటాయించారు. మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రి సీ రాజగోపాలచారి వద్ద కీలక బాధ్యతలు చేపట్టారు. ఆమె ఆర్‌ఎన్ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. 1985-90 మధ్యకాలంలో ఆర్‌ఎన్ మల్హోత్రా రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌గా పనిచేశారు. ముంబయిలో జవహర్‌లాన్ నెహ్రూ పోర్టు ట్రస్ట్(జేఎన్‌పీటీ) ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. మద్రాస్ ప్రభుత్వం ఆమెను డిప్యుటేషన్‌పై పంపగా జేఎన్‌పీటీ చైర్‌పర్సన్‌గా సేవలందించారు. అన్నా సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1989లో ఆమెకు పద్మభూషణ్ అవార్డు అందజేసింది. అన్నా మల్హోత్రా తమిళనాడులో ఏడుగురు ముఖ్యమంత్రుల వద్ద కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడోత్సవాలకు అన్నా మల్హోత్రా సారధ్యం వహించారు. దివంగత రాజీవ్‌గాంధీతో ఆమెకు సన్నిహిత సంబంధాలుండేవి. కేంద్ర హోమ్‌మంత్రిత్వశాఖలోనూ అనేక కీలక పదవులు నిర్వర్తించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పదవీ విరమణ అనంతరం హోటల్ లీలా వెంచర్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉండేవారు.

తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి అన్నా రాజమ్ మల్హోత్రా(91) (ఫైల్‌పొటో)