జాతీయ వార్తలు

ప్రభుత్వ అవినీతిపై డీఎంకే నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో ఏఐడిఎంకె ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ విపక్ష డిఎంకె ఆధ్వర్యంలో తమిళనాడు రాష్టవ్య్రాప్తంగా నిరసనలు చేపట్టారు. పళనిస్వామి నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ ఈ సందర్భంగా ఆరోపించారు. పళనిస్వామి, అతని మంత్రివర్గ సహచరులు తీవ్ర అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారని, గుట్కా కుంభకోణంలో పాత్ర ఉందన్న అనుమానంతో ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించడమే దీనికి నిదర్శనమని అన్నారు. అలాగే పళనిస్వామి ఆధ్వర్యంలో ఉన్న రహదారుల శాఖలో ఎంతో అవినీతి జరుగుతోందని ఆయన అన్నారు. ప్రజలు ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదని, చరిత్రలో ఎప్పుడూ రాష్ట్రానికి ఇలాంటి కళంకం రాలేదని, ఈ ప్రభుత్వం అవినీతి, బానిస ప్రభుత్వమని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, నిరుద్యోగం, శాంతిభద్రతల సమస్యలు అధికంగా ఉన్నాయని, ఈ రాష్ట్రంలో మహిళా పోలీస్‌లకు సైతం రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. అవినీతి ప్రభుత్వం నుంచి ప్రజలను రక్షించడం డిఎంకెకు మాత్రమే సాధ్యమని, అందులో భాగంగానే ఈ నిరసనలతో తాము మొదటి అడుగు వేసామని ఆయన చెప్పారు. తమ పార్టీ త్వరలోనే అధికారంలోకి వస్తుందని, అవినీతికి పాల్పడిన వారందరిపై తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
కాగా, అవినీతి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ డీఎంకే ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యకర్తలు మూడు వేలమంది కోయంబత్తూరులో నిరసన ప్రదర్శన చేశారు. రాష్టవ్య్రాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి, సోదరి కనిమొళి, పార్టీ సీనియర్ నేతలు దురయ్ మురుగన్, దయానిధి మారన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సేలంలో మంగళవారం జరిగిన నిరసన ర్యాలీలో మాట్లాడుతున్న డీఎంకే నాయకుడు స్టాలిన్