జాతీయ వార్తలు

రేవంత్‌కు ప్రమోషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: తెలంగాణ పీసీసీకి ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించటంతోపాటు శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రచార, ఎన్నికల ప్రణాళిక తదితర తొమ్మిది కమిటీలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. వెనుకబడిన కులాలకు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, తెలుగుదేశం వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్కకు అదనంగా ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావును ఎన్నికల వ్యూహ రచనా కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. శాసనసభ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు కోర్ కమిటీ, సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ప్రదేశ్ ఎన్నికల కమిటీ, ఎన్నికల ప్రణాళికా కమిటీ, వ్యూహ రచన ప్రణాళిక కమిటీ, ఎల్‌డీఎంఆర్‌సీ కమిటీ, ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ, క్రమశిక్షణా కమిటీని నియమించారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ స్పీకర్ కె.సురేష్‌రెడ్డిని సమన్వయ కమిటీ, ఎన్నికల కమిటీ, మ్యానిఫెస్టో కమిటీలో సభ్యుడిగా నియమించటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియా అధ్యక్షతన ఏర్పాటు చేసిన కోర్ కమిటీలో పదిహేను మందిని సభ్యులుగా నియమించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీఎల్‌పీ నాయకుడు జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, రాజనరసింహ, మధు యాష్కి, జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ, సలీం అహ్మద్, శ్రీనివాస కృష్ణన్, బోసురాజు ఈ కమిటీలో సభ్యులు. కుంతియా అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో 53 మంది నాయకులను సభ్యులుగా నియమించారు. భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కమిటీలో డీకె అరుణను సహఅధ్యక్షురాలిగా నియమించారు. శ్రవణ్ దాసోజి కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. టి.జగ్గారెడ్డి, అనీల్ యాదవ్, వెంకటేష్, ఎన్.శారద, అబ్దుల్లా సోహాలీ, బిలియా నాయక్, కృష్ణారెడ్డి, మనెబాటా రాయ్, బిజయ్‌కుమార్, కార్తీక్ రెడ్డి, ప్రేంలాల్, కుమార్ రావు, హెచ్.వేణుగోపాల్ ఈ కమిటీ సభ్యులు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రదేశ్ ఎన్నికల కమిటీలో 41 మందిని సభ్యులుగా నియమించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులందరినీ ఇందులో సభ్యులుగా నియమించారు. యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ, ఇంటక్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రైతు, మీడియా విభాగాల అధ్యక్షులు ఈ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులు.
మరో సీనియర్ నాయకుడు దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీకి కె.వెంకటరెడ్డి సహ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మహేష్‌కుమార్ గౌడ్ ఈ కమిటీ కన్వీనర్ బాధ్యతలు నిర్వహిస్తారు. మొత్తం 33 మంది సీనియర్ నాయకులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. వి.హనుమంతరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన వ్యూహ, ప్రణాళికా కమిటీకి సర్వే సత్యనారాయణ, మధు యాష్కి గౌడ్, శ్రీ్ధర్‌బాబులను సహ అధ్యక్షులుగా నియమించారు. ఎమ్మెల్సీ పి.సుధాకర్ రెడ్డి ఈ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సీనియర్ నాయకుడు జయపాల్ రెడ్డి, ఎంఏ ఖాన్, ఆనంద భాస్కర్, రేణుకా చౌదరి, క్యామా మల్లేష్ తదితర పదిహేను మందిని సభ్యులుగా నియమించారు. ఎల్‌డీఎంఆర్‌సీ కమిటీకి ఆరేపల్లి మోహన్ చైర్మన్‌గా వ్యవహరిస్తే డి.రవీంద్రనాయక్, హెచ్.వేణుగోపాల్ కోచైర్మన్, కన్వీనర్ బాధ్యతలు నిర్వహిస్తారు. సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల సంఘం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. బి.కమలాకర్ రావు కోచైర్మన్‌గా వ్యవహరిస్తే, జి.నిరంజన్ కన్వీనర్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ కమిటీలో ఆరుగురు సభ్యులుంటారు. సీనియర్ నాయకుడు ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీని నియమించారు. ఇందులో మొత్తం ఏడుగురు సభ్యులను నియమించారు.

చిత్రాలు.. రేవంత్‌రెడ్డి .పొన్నం ప్రభాకర్