జాతీయ వార్తలు

రాఫెల్‌పై జేపీసీ ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు జేపీసీని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించారు. రాహుల్ గాంధీ అహంకారాన్ని సంతృప్తి పరిచేందుకు జేపీసీ లేదా సీఏజీ విచారణకు ఆదేశించటం ఎంతమాత్రం సాధ్యం కాదన్నారు. రవి శంకర్ ప్రసాద్ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూర్తి సమాచారం తెలుసుకోకుండా ప్రతిరోజూ చేసే తప్పుడు ఆరోపణల ఆధారంగా జేపీసీని ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతమాత్రం అంగీకరించదని చెప్పారు. రాహుల్ ఆనాలోచితంగా ఆరోపణలు చేస్తూనే ఉంటారు.. అయితే రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని లాంటి సీనియర్ నాయకుడు సైతం రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేయటం బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు. ఎనిమిది సంవత్సరాలపాటు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాయుసేనను పటిష్టం చేసేందుకు, సైన్యాన్ని ఆధునీకరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోని ఆంటోని ఇప్పుడు దేశ రక్షణ గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. ఆంటోని రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఆఫ్‌సెట్ నియమాలను రూపొందించారు. ఆంటోని మూలంగానే హెచ్‌ఏఎల్‌ను గాలికి వదిలేశారు. వాస్తవానికి ఆంటోని సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. ఆంటోని రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం జరిగింది, అయినా పదేళ్లపాటు ఆయన ఏమీ చేయలేదని ప్రసాద్ ఆరోపించారు. ఆంటోని బాధ్యతారహితంగా మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. వాయుసేనకు అర్జెంటుగా యుద్ధ విమానాల అవసరం ఉన్నది.. యుద్ధ విమానాలు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి.. పైలట్లు మరణిస్తున్నారు.. ఇది ఎక్కుక కాలం కొనసాగటం మంచిది కాదని అన్నారు. తమ ప్రభుత్వం నిజాయితీతో వాయుసేనను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.