జాతీయ వార్తలు

దిగుమతుల తగ్గింపునకు త్వరలోనే చర్యలు: గార్గ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కేంద్ర ప్రభుత్వం త్వరలో అత్యవసరం కాని అనేక సరుకుల దిగుమతులపై ఆంక్షలు విధించనుంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ బుధవారం ఈ విషయం వెల్లడించారు. అయితే, గత కొన్ని వారాలలో రూపాయి మారకం విలువ పది శాతం పతనం కావడం అనేది తాత్కాలికమేనని ఆయన పేర్కొన్నారు. పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ బుధవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘డాలర్, రూపాయి మారకం విలువ చిక్కులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే, గత కొన్ని వారాలలో డాలర్‌తో రూపాయి మారకం విలువ పది శాతం పడిపోవడం అనేది తాత్కాలికమే’ అని అన్నారు. ‘ప్రభుత్వం అత్యవసరం కాని సరుకుల దిగుమతులను అణచివేయాలని యోచిస్తోందా?’ అనే ప్రశ్నకు గార్గ్ ‘అతి త్వరలోనే’ అని బదులిచ్చారు. అయితే, ఈ విషయంలో ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. పెరుగుతున్న కరెంటు ఖాతా లోటు (సీఏడీ)ను, రూపాయి పతనాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం విదేశీ రుణాలను పెంచడానికి మార్గదర్శకాలను నియంత్రిస్తుందని, అత్యవసరం కాని సరుకుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తుందని గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దేశ కరెంటు ఖాతా లోటు 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.9 శాతానికి పెరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 0.6 శాతం ఉండింది. ప్రస్తుత (2018-19) ఆర్థిక సంవత్సరంలో ఇది 2.8 శాతానికి పెరుగుతుందని అంచనా.