జాతీయ వార్తలు

ప్రాజెక్టుల రక్షణకు అదనపు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశంలోని 198 ప్రాజెక్టుల రక్షణకు అంచనాలను పెంచుతూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనితో ఆయా ప్రాజెక్టుల వ్యయం రూ.3,466 కోట్లకు పెరుగుతుంది. అంతకుముందు ఈ వ్యయం రూ.2,100కోట్లు కాగా ఈ మొత్తంలో రాష్ట్రాలు రూ.1,968కోట్లు, కేంద్రం రూ.132 కోట్లు భరించాల్సి వుంది. కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కర్నాటక, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 198 ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పిచడంతోపాటు ప్రాజెక్టు రక్షణ చర్యల నిమిత్తం ఈ నిధులను వినియోగిస్తారు. ఈ పథకం కాలపరిమితి ఆరేళ్లు కాగా, 2012 ఏప్రిల్‌లో ప్రారంభమై జూన్ 2018తో ముగియాల్సి వుంది. అయితే ప్రపంచ బ్యాంకు, నీటి వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీనిని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ పథకం 2020 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది.