జాతీయ వార్తలు

నేడు కేరళకు కేంద్ర బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కేరళలో వరద పీడిత ప్రాంతాల్లో నష్టం అంచనాకు కేంద్ర బృందం గురువారం రానుంది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలో బృందం ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుందని ఓ అధికార ప్రకటనలో వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలకు కేరళ తీవ్రంగా దెబ్బతింది. కష్టాల నుంచి గట్టేక్కాలంటే 4,700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈమేరకు కేంద్రానికి వినతిపత్రం అందించింది. దీంతో నష్టం అంచనాకు కేంద్ర హోమ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి బీఆర్ శర్మ నాయకత్వాన్న ఓ కమిటీని నియమించింది. కేంద్ర బృందం ఈనెల 20 నుంచి 24 వరకూ రాష్ట్రంలో పర్యటిస్తుంది. ప్రకృతి విలయానికి కేరళలో 488 మంది చనిపోయారు. 14 జిల్లాల్లో కనీవినీ ఎరుగని ఆస్తినష్టం సంభవించింది. వరదల వల్ల అపారనష్టం వాటిల్లిందని పేర్కొంటూ రాష్ట్రం ఓ వినతిపత్రం కేంద్రానికి అందజేసింది. శాఖల వారీగా ఎక్కడ ఎంత నష్టం జరిగిందీ పూర్తి వివరాలతో కేంద్రానికి ఓ నివేదిక అందచేసింది. సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం తక్షణం 4,700 కోట్ల రూపాయలు పరిహారం అందించాలని రాష్ట్రం అభ్యర్థించింది. వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఓ అంచనాకు వస్తుంది. దాన్నిబట్టే అదనపుసాయం మంజూరుకు సిఫార్సు చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీప్(ఐఎంఎస్‌టీ) మార్గదర్శకాల ప్రకారం నష్టంపై ఓ నివేదికను సబ్‌కమిటీకి అందజేస్తారు. అక్కడ పరిశీలించిన తరువాత హోమ్‌మంత్రి అధ్యక్షతన గల ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలుపుతుంది. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ సహా పలు శాఖల సహకారం తీసుకుని ఆర్థిక సహకారంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఐదువేల కోట్లు, హోమ్‌మంత్రి ప్రకటించిన వంద కోట్లు మొత్తం కలిపి 600 కోట్లను ఆగస్టు 21న కేంద్రం విడుదల చేసింది. ఇవి కాకుండా అదనంగా 562.45 కోట్ల రూపాయలు రాష్ట్ర విపత్తుల నిర్వహణ ఫండ్ వద్ద అందుబాటులో ఉన్నాయి.

కేరళలో వరదలకు నీట మునిగిన ఓ గ్రామం (ఫైల్)