జాతీయ వార్తలు

నిర్మలా.. రాజీనామా చెయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. గురువారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ- హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేయగలుగుతుందని ఆ సంస్థ అధ్యక్షుడు టి.సువర్ణ రాజు స్పష్టం చేసిన విషయాన్ని తివారీ ఉటంకించారు. హెచ్‌ఏఎల్ రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేయలేదంటూ నిర్మలా సీతారామన్ బుధవారం చేసిన ప్రకటన అబద్ధమని ఆయన చెప్పారు. నిర్మలా సీతారామన్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించారని, రక్షణ మంత్రిగా ఒక్క నిమిషం కూడా కొనసాగే హక్కు, అధికారం ఆమెకు లేదని ఆయన స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు జరపవలసిందేనని, ఇది జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తివారీ చెప్పారు. నిర్మలా సీతారామన్, ఎన్‌డీఏ అధినాయకులు మొదటి నుండీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తివారీ ఆరోపించారు. అధునాతన సుఖోయ్-30 యుద్ధ విమానాలను తయారు చేయగలగుతున్న హెచ్‌ఏఎల్ రాఫెల్ విమానాలు తయారు చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. దుస్సాల్ట్ తయారు చేసిన మిరాజ్ యుద్ధ విమానాలను నిర్వహించే తాము అదే సంస్థ తయారు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేయలేమా? అంటూ రాజు వేసిన ప్రశ్నకు ఎన్‌డీఏ ప్రభుత్వం ఏ సమాధానం చెబుతుందని మనీష్ తివారీ నిలదీశారు. హెచ్‌ఏఎల్ ఉత్పత్తులు సంతృప్తికరంగా లేవు.. వినియోగదారులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారంటూ నిర్మలా సీతారామన్ తన ఆధీనంలోని సంస్థపైనే ఆరోపణలు చేయటం దురదృష్టకరమని తివారీ విమర్శించారు. హెచ్‌ఏఎల్ రాఫెల్ యుద్ధ విమానాలను చౌకగా ఉత్పత్తి చేయగలిగేదంటూ రాజు చేసిన ప్రకటనను తివారీ విలేఖరుల దృష్టికి తెచ్చారు. హెచ్‌ఏఎల్ సామర్థ్యం పట్ల యుపీఏ ప్రభుత్వానికి విశ్వాసం ఉండింది కాబట్టే రెండు స్క్వాడ్రన్ల రాఫెల్ యుద్ధ విమానాలను ఇక్కడ తయారు చేయాలని ప్రతిపాదించిందని తివారీ చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ గురించి గొప్పగా చెప్పుకునే ఎన్‌డీఏ ప్రభుత్వం స్వదేశంలో రాఫెల్ యుద్ధ విమానాల తయారీని ఎందుకు వ్యతిరేకించిందని ఆయన నిలదీశారు. హెచ్‌ఏఎల్‌కు దుస్సాల్ట్ సంస్థకు మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో యుపీఏ ప్రభుత్వం హెచ్‌ఏఎల్‌కు మద్దతు ఇవ్వలేదంటూ నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలను తివారీ తీవ్రంగా ఖండించారు. హెచ్‌ఏఎల్-దుస్సాల్ట్ సంస్థలు ఒక అవగాహనకు రాలేకపోయినందుకే 126 రాఫెల్ యుద్ధ విమానాలను భారతదేశంలో తయారు చేసే ప్రతిపాదనను విరమించుకున్నామంటూ సీతారామన్ చేసిన ప్రకటన పూర్తిగా సత్యదూరమన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే సామర్థ్యం హెచ్‌ఏఎల్‌కు ఉన్నదంటూ రాజు చేసిన ప్రకటన సీతారామన్ నిజ స్వరూపాన్ని బైటపెట్టిందని తివారీ చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేసి ఉంటే యుద్ధ విమానాల తయారీలో స్వయం సమృద్ధిని సాధించి ఉండేవాళ్లమని ఆయన తెలిపారు. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన అన్ని ఫైళ్లను ప్రజల ముందు పెట్టాలని తివారీ డిమాండ్ చేశారు.