జాతీయ వార్తలు

మోదీ..వౌనమేల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్లలో బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీ అవినీతికి పాల్పడ్డారని చెప్పేందుకు ఆధారమన్నారు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా, ప్రధాని మోదీ నోరు విప్పడం లేదన్నారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అవసరమైతే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ను రప్పించవచ్చన్నారు. దీని వల్ల నిజాలు బహిర్గతమవుతాయన్నారు. హోలండ్ కూడా భారత ప్రధాని మోదీ దొంగ అని అన్యాపదేశంగా అన్నారని పేర్కొన్నారు. హోలాండ్ చేసిన ప్రకటనను అంగీకరించాలని లేదా తప్పని నిరూపించాలని ఆయన మోదీని కోరారు. ప్రధాన మంత్రి కార్యాలయం ప్రతిష్ట దిగజారిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది మన దేశానికి సంబంధించిన అంశం. రక్షణ రంగం, జవాన్లు, సరిహద్దుల భవిష్యత్తు దీంతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. ఇంత జరుగుతున్నా, ప్రధాని మోదీ మాత్రం తనకేమీ తెలియనట్లు నటిస్తూ నిశ్శబ్ధంగా ఉండడం దారుణమన్నారు. రాఫెల్స్ విషయంలో వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. దాటవేత వైఖరి పనికిరాదన్నారు. ఈ జెట్స్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని చెప్పేందుకు ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలన్నారు. మోదీ అవినీతి బహిర్గతమైందని, ఇక దీనిపై దాగుడుమూతలెందుకని ఆయన అన్నారు. రాఫెల్స్‌లో అవినీతి జరిగిందని ప్రజలునమ్ముతున్నారని, దేశ రక్షకుడే భక్షకుడైతే, దొంగగా మారితే ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఎప్పుడు చూసినా మంచి బ్లాగ్‌లు రాస్తారని, కాని జేపీసీ చేత డిమాండ్ జరిపించాలరని కోరితే మాత్రం మాట్లాడడం లేదన్నారు. జేపీసీని ఏర్పాటుచేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.కాంట్రాక్టును రక్షణ రంగంలో అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థకు ఎలా ఇచ్చారని, దీనిపై వివరణ అడిగితే మాట్లాడకుండా సాకులు చెబుతున్నారన్నారు. కేంద్రప్రభుత్వానికి ఈ విషయంలో ఏ మాత్రం సంబంధం లేదని దాసాల్ట్ సంస్థనే అంబానీ సంస్థను ఎంపిక చేసుకుందని చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. రక్షణ రంగానికి సంబంధించి రూ.1.30 లక్షల కోట్ల గోల్‌మాల్ జరిగిందని, మోదీ, అంబానీ కలిసి రక్షణ రంగంపై సర్జికల్ స్ట్రైక్ చేశారన్నారు. ఈ ఒప్పందం ముసుగులో ప్రజలను మోసం చేయడం తగదన్నారు.

చిత్రాలు.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
* రాఫెల్ కుంభకోణానికి నిరసనగా శనివారం ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తను అడ్డుకుంటున్న పోలీసులు