జాతీయ వార్తలు

ఆస్కార్‌కు ‘విలేజ్ రాక్‌స్టార్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 22: రిమాదాస్ దర్శకత్వంలో రూపొంది ఇప్పటికే నేషనల్ అవార్డును సాధించిన ఫీచర్ ఫిల్మ్ ‘విలేజ్ రాక్‌స్టార్’ వచ్చే సంవత్సరం జరగనున్న 91వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల పోటీలో ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో భారత్ తరపున పోటీ పడటానికి ఎంపికయింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) శనివారం ఈ విషయాన్ని ప్రకటించింది. కడు పేదరికాన్ని అనుభవించి, తన కాళ్లపై తాను నిలబడటం నేర్చుకున్న ధును అనే బాలికకు సంబంధించిన కథే విలేజ్ రాక్‌స్టార్. ఏదో ఒక రోజు రాక్ బ్యాండ్‌ను ఏర్పాటు చేయాలని, తనకంటూ ఓ గిటార్ ఉండాలని ధును కన్న కలలు నిజం కాకుండా ఆమె పేదరికం అడ్డుకోలేకపోయింది. స్ఫూర్తివంతమయిన ఈ ఫీచర్ ఫిల్మ్‌ను ఆస్కార్ అవార్డుల పోటీకి ఎంపిక చేసినట్లు ఎఫ్‌ఎఫ్‌ఐలోని ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్ రాజేంద్ర సింగ్ బాబు తెలిపారు. 2017లో టొరొంటోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇప్పటివరకు 70కి పైగా అంతర్జాతీయ, జాతీయ చలన చిత్రోత్సవాలలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం కూడా ఆస్కార్‌ను సొంతం చేసుకోలేకపోయింది.
అయితే, ఆస్కార్ అవార్డుల పోటీలో ఇప్పటి వరకు మొత్తం అయిదు భారతీయ చిత్రాలు ఉత్తమ విదేశీ భాషా చిత్రాల కేటగిరీలో మేటి అయిదు చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.