జాతీయ వార్తలు

వైద్య వృత్తి సేవాభావానికి ప్రతిరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని, వైద్య విద్యార్థులు జ్ఞానంతోపాటు సేవాభావాన్ని అలవరుచుకుని ఆదర్శంగా నిలవలని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయు డు పిలుపునిచ్చారు. విశాఖపట్నం గీతమ్ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు శనివారం వెంకయ్య నాయుడని కలిశారు. విద్యార్థులను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, సమాజంలో వైద్యులను దేవుళ్లుగా చూస్తారని, అలాంటి వృత్తికి సేవాభావంతో సార్థకత చేకూరుతుందని తెలిపారు. అంకిత భావం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే మనస్థత్వం, ఉన్నతమైన లక్ష్యలద్వారా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించారు. నేటి సమాజంలో ఆర్థిక అసమానతలు పెరగడం, అభిరుచులు మారడం, సమాజ దృక్పథంలో మార్పు రావడం, కాలుష్యం మరింతగా ఎక్కువైన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వైద్యుల సలహాలతోపాటు సేవాభావంతో కూడిన సహకారం అవసరమని ఆయన తెలిపారు. సుశృతుడు, చరకుడు, ధన్వంతరి లాంటి మహనీయులు మనకు ఆదర్శంగా ఉన్నారని, ఈ రోజు ప్రపంచం భారతీయ వైద్యులు వైపు మాత్రమే గాక, భారతీయ ఆయుర్వేదం వైపు చూస్తోందని చెప్పారు.