జాతీయ వార్తలు

ఆయనేమన్నా దేవుడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశ వ్యాప్తంగా ఒకే సిద్ధాంతాన్ని రుద్దేందుకు ప్రయత్నించడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పరివ్యాప్తం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ఒకే సిద్ధాంతం ప్రాతిపదికగా భారత దేశాన్ని ముందకు నడిపించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. దేశంలో సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలపై ఓ వ్యూహం ప్రకారం పెత్తనం చెలాయించేందకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. శనివారం ఇక్కడ సిరిపోర్టులో విద్యావేత్తలతో కాంగ్రెస్ అధ్యక్షుడు భేటీ అయ్యారు. దేశ ప్రజలపై తన భావజలాన్ని రుద్దేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్, దాని చీఫ్ మోహన్ భగవత్‌పైనా మండిపడ్డారు. భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశాన్ని సరైన మార్గంలో పెట్టబోతున్నామని గతంలో భగవత్ వ్యాఖ్యానించారన్న రాహుల్4 యావత్ దేశాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆయన ఎవరు?2అని నిలదీశారు. భగవత్ ఏమన్నా దేవుడా దేవుడా? అంటూ నిప్పులు చెరిగారు. దేశం తనను తానే సక్రమ మార్గంలో పెట్టుకుంటుందని రాహుల్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ)లో ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులను తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. గతంలో ఎస్‌పీజీ అధిపతిగా వచ్చిన అధికారిపై ఈ మేరకు ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని ఆయన అన్నారు. ఆ విషయం ఆ అధికారి తనతో చెప్పారని రాహుల్ వెల్లడించారు. మోదీ వత్తిళ్లకు తలగ్గొని తరువాత బదిలీ చేశారని కాంగ్రెస్ చీఫ్ ధ్వజమెత్తారు. రాజ్యాం సంస్థల్లోకి ఓ పద్ధతి ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్ చొరబడుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం వంటి సంస్థల్లోకి చొరబడేందుకు సంఘీయులు ప్రయత్నిస్తున్నట్టు ఆయన విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం లేని వ్యవస్థ ఏదీ ఉండకూదనేది దాని అసలు సిద్ధాంతమని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలపై ఆయన మండిపడ్డారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వం విద్యా సంస్థలకు వౌలిక సాదుపాయాలు కల్పించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

చిత్రం..విద్యావేత్తలతో జరిగిన భేటీలో మాట్లాడుతున్న ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ