జాతీయ వార్తలు

బీసీ, ఎస్సీలకు కాంగ్రెస్ గాలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ‘సోషల్ ఇంజనీరింగ్’ చేయాలనుకుంటోంది. తెలుగుదేశంతోపాటు రాష్ట్రంలోని ఇతర చిన్న పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం వెనుకబడిన కులాల్లో మంచి పట్టున్న బీసీ సంఘం జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్య, మాదిగ పోరాట సమితి అధినాయకుడు మంద కృష్ణ మాదిగ, మాజీ కమ్యూనిస్టు గద్దర్‌తో చేతులు కలపాలనుకుంటోంది. మహాకూటమికి బీసీ, ఎస్సీ వర్గాలకు నాయకత్వం వహిస్తున్న కృష్ణయ్య, మంద కృష్ణమాదిగ, గద్దర్ లాంటి వారితో చేతులు కలపగలిగితే టీఆర్‌ఎస్‌ను సునాయాసంగా ఓడించవచ్చునని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఈ అసంతృప్తిని ఓట్లుగా మార్చుకునేందుకు సమర్థ రాజకీయ వ్యూహాన్ని అనుసరించాలన్నది కాంగ్రెస్ ఆలోచన. రాష్ట్రంలోని బడుగు, బలహీన, ఎస్సీ వర్గాల మద్దతు కూడగట్టగలిగితే శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు.
ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ, గద్దర్ లాంటి నాయకులను మహాకూటమిలోకి తీసుకురాగలిగితే టీఆర్‌ఎస్‌ను ఓడించటం సులభమవుతుందనేది వారి వాదన. అయితే కృష్ణయ్య తదితర నాయకులను మహాకూటమిలోకి తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణ పీసీసీ సీనియర్ నాయకులు గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. కృష్ణయ్యకు వెనుకబడిన కులాల్లో మంచి పలుకుబడి ఉన్నా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను మహాకూటమిలోకి తీసుకోవటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాదిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధినాయకత్వం త్వరలోనే కృష్ణయ్య తదితర నాయకులను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.