జాతీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌దే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రాజస్థాన్‌లోని బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, ముఠాలు పెరిగిపోయాయని, అమిత్‌షా నేతృత్వంలో ఒక గ్రూపు, ముఖ్యమంత్రి వసుంధరరాజే ఆధ్వర్యంలో మరో గ్రూప్ పనిచేయడమే దీనికి నిదర్శనమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్‌పైలట్ విమర్శించారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయని, అందులో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ పార్టీల పొత్తులకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ నేతగా పూర్తి వివరాలతో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు నివేదిక ఇచ్చానని, తుది నిర్ణయం ఆయనదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమకు చాలాబలమైన కేడర్ ఉందని, మంచి నాయకులు ఉన్నారని, ఇది తమకు సానుకూల అంశమని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సచిన్ పైలటా? అశోక్ గెహ్లాట్ ఉంటారా అని బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ తమ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవని స్పష్టం చేశారు. ఇప్పుడు రాజస్థాన్ బీజేపీలో తీవ్ర అంతః కలహాలు చేటుచేసుకున్నాయని ఆయన విమర్శించారు. అమిత్‌షా, వసుంధర రాజే రాష్ట్రంలో ఎవరికి వారు ప్రచారాలు చేయడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. అభ్యర్థుల ఎన్నిక విషయంలో కూడా అమిత్‌షా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నారు. రాఫెల్ విమానాల ఒప్పందం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ కుంభకోణానికి సంబంధించి బీజేపీ తగిన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సోసిస్ హోలాండో చేసిన ప్రకటనను బట్టి చూస్తే సందేహం లేకుండా ఈ వ్యవహారంలో కోట్ల కుంభకోణమే జరిగిందని అర్థమవుతోందని అన్నారు. గత ఎన్నికల ప్రచారంలో అవినీతిలో భాగస్వామిని కాను, ఇతరులు అవినీతికి పాల్పడనీయను అని వాగ్దానం చేసిన మోదీ ఇప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా భారీ కుంభకోణంలో దొరికారని విమర్శించారు. త్వరలో జరగనున్న ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఘన విజయం సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా ఉంచుకుందని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణ ఎన్నికలు సైతం ఈ ఏడాదే జరుగుతాయని భావిస్తున్నామన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే తనపై చేస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ తనపై వ్యక్తిగతంగా ఆమె కనుక దాడికి పూనుకున్నట్టయితే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. రాజస్థాన్‌లో నిధుల సేకరణ నిర్ణయం ఏఐసీసీ తీసుకున్నదని, అధిష్టానం చేపట్టే కార్యక్రమాల్లో తాము తప్పనిసరిగా భాగస్వాములవుతామని సచిన్‌పైలట్ చెప్పారు.