జాతీయ వార్తలు

ఆత్మహత్యల నివారణకు జాతీయస్థాయి విధానం ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశంలో ఆత్మహత్యల నివారణకు జాతీయస్థాయిలో ఒక విధానాన్ని ఏర్పాటు చేయాలని ఆరోగ్య నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మహిళల ఆత్మహత్యల్లో 37 శాతం భారత్‌కు చెందిన వారివేనని వెల్లడిస్తున్న నిజాలు ఆందోళన కలిగిస్తున్నాయని, మహిళల బాధలు తెలుసుకోవడానికి, వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఒక విధానం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. 1990-2016 మధ్య ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేకు సంబంధించిన వివరాలను లానె్సట్ పబ్లిక్ హెల్త్ జర్నల్ ఇటీవల ప్రచురించింది. దీనిప్రకారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల్లో 2016లో 37 శాతం భారతీయ మహిళలు, 34 శాతం పురుషులు ఉన్నారు. ఇప్పుడు ఆత్మహత్యలు అన్నవి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మత. అయితే ఆ సమయంలో వారిని ఆ నిర్ణయం నుంచి పక్కకు మార్చగలిగితే ఆత్మహత్యలు శాతాన్ని బాగా తగ్గించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
మానసిక, శారీరక ఒత్తిడి, తాత్కాలిక ఉద్రేకం, నిరాశ, నిస్పృహలు సాధారణంగా ఆత్మహత్యలకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా పురుషుల కంటే మహిళల్లో వీటిశాతం అధికంగా ఉంది. మన సమాజంలో ఇంటిని నిర్వహించే బాధ్యత ఇల్లాలిపైనే ఉంటోంది. దీంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఆమె చేసిన సేవలను మనం సరిగ్గా గుర్తించకపోవడంతో ఆమె వివక్షకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె అనారోగ్యం పాలవుతోంది కూడా.. అని డిపార్టుమెంట్ ఆఫ్ మెంటర్ హెల్త్ అండ్ బిహేవిరియల్ సైన్స్ డైరెక్టర్ సమీర్ పారిక్ పేర్కొన్నారు. చిన్నచిన్న కారణాలకు సైతం మహిళలు తీవ్రంగా స్పందించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఆ సమయంలో వారిని కనుక నియంత్రించగలిగే యంత్రాగం ఉంటే వీటి శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని ఆయన అన్నారు. ముఖ్యంగా భారత్‌లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 63 శాతం 13-39 సంవత్సరాల మధ్యవారే. కాగా, మహిళల్లో సాధికారిత, ఆత్మగౌరవం, ఆరోగ్యం వంటివి కల్పించడం ద్వారా సైతం ఆత్మహత్యలను తగ్గించవచ్చునని మరొక నిపుణుడు పేర్కొన్నారు. సమాజం, కుటుంబ పోషణలో మహిళలు ప్రధాన పాత్రను మనం విస్మరించలేమని, ఈ నేపథ్యంలో వారికి సమాన హక్కు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్మైల్ ఫౌండేషన్ జిఎం సీమాకుమార్, ద లైవ్, లవ్, లాఫ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ అన్నా చాండి తదితరులు అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలు కేవలం వివక్షకు మాత్రమే గురికావడం లేదని, వారు సానుభూతి, జాలిని సైతం పొందలేకపోతున్నారని వారు అన్నారు. వారు తమకు ఎదురయ్యే సమస్యలను ఎవరికైనా చెప్పుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని, నిరాశ, ఇతర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడకుండా వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించే వ్యవస్థను ప్రభుత్వం రూపొందించాలని అన్నారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు, అందుకే వారికి తగిన సహకారం, సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని వారు అభిప్రాయపడ్డారు.