జాతీయ వార్తలు

ఆరోగ్యమే మహాభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి, సెప్టెంబర్ 23: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన-ఆయుష్మాన్ భారత్ కోట్లాది మంది భారత ప్రజలకు ఆశాదీపం అని, ఈ పథకాన్ని చాలామంది ‘మోదీ కేర్’ అని మరో విధంగానూ పిలుస్తున్నారని, కాని తాను మాత్రం పేదలకు సేవచేసే గొప్ప అవకాశంగా దీనిని భావిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆదివారం ఆయన ఇక్కడ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఇది పేదల జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చే పథకమని వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంక్షేమ పథకమని, దీని ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య కెనడా, మెక్సికో, అమెరికా జనాభాతో ఇంచుమించు సమానమని అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకు మాత్రమే పాల్పడ్డాయని ఆయన విమర్శించారు. పేదలకు సాధికారిత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. అందుకే దీనిని ప్రవేశపెట్టామని, సమాజంలో అట్టడుగు స్థాయి వ్యక్తి సైతం గొప్పవారికి దీటుగా ఆధునిక వైద్యం లభిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా హృద్రోగం, డయాబెటిస్, కిడ్నీ, లివర్ లాంటివే కాకుండా మొత్తం 1300 వ్యాధులకు ఉచితంగా చికిత్స లభిస్తుందని ఆయన చెప్పారు. ఈ పథకం అమలులో భాగస్వాములవుతున్న సిబ్బంది, అధికారులను ఆయన అభినందిస్తూ దీనిద్వారా లబ్ధి పొందే 50 కోట్ల ప్రజల ఆశీస్సులు వారికి లభిస్తాయని అన్నారు. మీలో ఎవరైనా అస్వస్థతకు గురైతే పెద్దపెద్ద ఆసుపత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవద్దు. గొప్పవారితో సమానంగా వైద్యసేవలు అందించే ఈ పథకం ద్వారా మీరంతా లబ్ధి పొందాలి అని ఆయన ఆకాంక్షించారు. అందరికోసం కలుద్దాం, అందరికోసం అభివృద్ధి నినాదాన్ని ఆయన పునరుద్ఘాటిస్తూ ఈ పథకం కులం, మతం, జాతి, ప్రాంతీయం లాంటి భేదాలు లేకుండా అందరికీ ఉపయోగపడేదని అన్నారు. అర్హుడైన ప్రతి వ్యక్తి దీని ద్వారా లబ్ధి పొందవచ్చునని మోదీ చెప్పారు. ఇందులో భాగస్వాములవ్వడానికి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అర్హులకు హెల్త్ కార్డును ఇస్తారని, ఈ పథకానికి సంబంధించి 24 గంటలూ టోల్‌ఫ్రీ అందుబాటులో ఉంటుందని, దేశవ్యాప్తంగా 2,500 ఆధునిక ఆసుపత్రులు వైద్యసేవలు అందించడానికి అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొందరికి హెల్త్ కార్డులను అందజేశారు. ఇక్కడి ప్రభాత్ తారా మైదాన్‌కు విచ్చేసిన అనంతరం చైబసా, కొడెర్మల్లో రెండు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు.
చిత్రం... రాంచీలో ఆదివారం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా
జరిగిన సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీ