జాతీయ వార్తలు

మహాత్మాగాంధీ ప్రభోదాలపై ముషాయరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: మహాత్మా గాంధీ సూక్తుల్లోని సారాన్ని వివరించే ఉర్దూ కవితలపై ‘ముషాయరా’ పేరిట దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని (కవి సమ్మేళనాలను) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహాత్ముని 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం నాడిక్కడ తెలిపింది. ఢిల్లీలోని అంబేదర్ అంతర్జాతీయ కేంద్రంలో అక్టోబర్ 6న ముషాయరా పేరిట సింపోజియం (సదస్సు)ను తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు సంబంధిత శాఖ మంత్రి అబ్బాస్ నక్వి చెప్పారు. శాంతి, సహనం, జాతీయ సమగ్రత, ప్రజాస్వామిక విలువలు, అహింస, ప్రపంచ శాంతి వంటి మహాత్ముని ఆశయాలను వివరిస్తూ దేశం నలుమూలల నుంచి తరలివచ్చే ఉర్దూ కవులు తమ కవితలు వినిపిస్తారని మంత్రి చెప్పారు, గుల్జార్, వాసిం బారెల్వీ, రాజేష్‌రెడ్డి, మన్సూర్ ఉస్మానీ వంటి పేరేన్నికగన్న కవులెందరో ఈ కవి సమ్మేళనానికి హాజరవుతారన్నారు, ఈ కార్యక్రమాలను తమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ, ముంబై, లక్నో, చండీఘర్, అహ్మదాబాద్, బెంగళూరు, రాంచీ తదితర ప్రాంతాల్లో నిర్వహించనుందని ఆయన తెలిపారు. ఈ యేడాది మహాత్ముని 150వ జయంత్యుత్సవాల నిర్వహణకు జాతీయ స్థాయిలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చైర్మన్‌గా ఓ కమిటీని గత జూన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.