జాతీయ వార్తలు

అక్రమ వలసదారులతో సమస్యలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అక్రమంగా చొరబడిన శరణార్థులను గుర్తించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీలు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, చొరబాటుదారుల కొమ్ముకాసేవిధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. దేశ రాజధానిలో కూడా అక్రమ చొరబాటుదార్ల బెడత తీవ్రంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రతి చోట అక్రమ చొరబాటుదారులను గుర్తించే కార్యక్రమం చేపడుతామన్నారు. ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాలా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎంతటికైనా దిగజారుతారన్నారు. ఆదివారం ఇక్కడ రాంలీలా మైదానంలో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో ఏడు లోక్‌సభ సీట్లలో తమ పార్టీ గెలుస్తుందన్నారు. అక్రమ శరణార్థులను గుర్తించేందుకు అస్సాం తరహాలో జాతీయ పౌరరిజిస్టర్ కార్యక్రమాన్ని చేపట్టాలనే డిమాండ్‌లు వస్తున్నాయన్నారు. శరణార్థుల వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. శరణార్థులు అక్రమంగా చొరబడి అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నాలు చేస్తుంటే, ఈ ఇద్దరు నేతలు వారిని వెనకేసుకుని వస్తున్నారన్నారు. దేశ ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకుపైనే ఈ ఇద్దరు నేతలు గురిపెట్టారన్నారు. ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా ఆమ్ ఆద్మీపార్టీ పెట్టుకుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం గత నాలుగున్నరేళ్లలో రూ.50 వేల కోట్ల నిధులు మంజూరుచేసిందన్నారు. కాని అభివృద్ధికి నిధులు వెచ్చించకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. బీజేపీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక విపక్షాలు మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, కాని వీరిని ప్రజలు ఆదరించడం లేదన్నారు. మహాకూటమికి నాయకుడు లేరని, విధానాలు లేవని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ మహాకూటమి కావాలంటున్నారని, మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవార్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఒకే వేదికపైకి రావడానికి తటపటాయిస్తున్నారన్నారు. తూర్పుయూపీ, ఒడిశా, జార్ఖాండ్, బీహార్ రాష్ట్రాల్లో ఎక్స్‌ప్రెస్ హై వే ఇతర వౌలిక సదుపాయాలకు కేంద్రం రూ.13 లక్షల కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ మాట్లాడుతూ దేశరాజధానిలో బంగ్లాదేశ్, రోహింగ్యా వర్గం వారు శరణార్థులుగా వచ్చి తిష్ట వేశారని, వీరిని గుర్తించి వెనక్కు పంపించి వేస్తామన్నారు.
చిత్రం..ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన పూర్వాంచల్ మహా కుంభమేళాను ఉద్దేశించి
మాట్లాడుతున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా