జాతీయ వార్తలు

రాహుల్ ఆరోపణలు అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఆర్‌ఎస్‌ఎస్ సిఫార్సు చేసిన అధికారులను నియమించడానికి స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్సు (ఎస్‌పిజి) మాజీ చీఫ్ నిరాకరించడం వల్లే ఆయనను పదవి నుంచి తొలగించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారం, అవాస్తవమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రధాని, మాజీ ప్రధాని, వారి కుటుంబాల రక్షణ చూసే బాధ్యత ఎస్పీజీదే అన్న విషయం మరువరాదని, దీనిపై రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఒక ఉన్నతాధికారి వివరణ ఇస్తూ రాహుల్‌గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ ఎస్‌పిజి రక్షణలో ఉంటారని చెప్పారు. ఎస్‌పిజి ఒక ప్రొఫెషనల్ సంస్థ అని, విఐపీలు, వీవీఐపిల రక్షణే దాని బాధ్యత అని తెలిపారు.
రెండు రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ స్వయంప్రతిపత్తి కలిగి ఉన్న సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ లను ఒక పథకం ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుంటోందని ఆరోపించారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తిని ఎస్పీజీ చీఫ్‌గా నియమించారని, అయితే కొద్ది కాలానికే అతడిని ఆ పదవి నుంచి తప్పించారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ తెచ్చిన లిస్టులోని అధికారులను ఎస్‌పిజిలో నియమించనందుకే తనను చీఫ్ పదవి నుంచి తప్పించారని ఆ అధికారి తనకు తెలియజేశారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీనిపై హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. తొలగించిన ఆ అధికారి వివేక్ శ్రీవాత్సవను ఈ విషయమై తాము ప్రశ్నించామని, తాను రాహుల్‌తో అలా ఎప్పుడూ అనలేదని తమకు వివరణ ఇచ్చాడని పేర్కొంది. ఉద్యోగ నిర్వహణలో భాగంగా తాను రాహుల్‌గాంధీతో ఎప్పుడైనా మాట్లాడి ఉండవచ్చునేమో గాని, తన నియామకం విషయమై గాని, తొలగించడంపై గాని ఆయనతో ఎలాంటి సంభాషణ జరపలేదని శ్రీవాత్సవ స్పష్టం చేశారని, దీనిని బట్టి రాహుల్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అర్థమవుతోందని హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.