జాతీయ వార్తలు

అర్బన్ నక్సల్స్ పనిపడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, సెప్టెంబర్ 24: నక్సల్స్‌కు వారి సానుభూతిపరుల నుంచి మేధో, ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందకుండా తమ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతోందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ అన్నారు. పీటీఐతో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న బస్తర్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టామని, దీంతో సానుభూతిపరుల వ్యవస్థ క్రమేణా నిర్వీర్యం అవుతుందన్నారు. వరుసగా నాలుగోసారి సైతం రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయడానికి 2003 నుంచి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని, ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని అన్నారు. నక్సల్స్ కార్యక్రమాలు అధికంగా ఉన్నచోట అభివృద్ధి పథకాలను చేపట్టి ప్రజల అభిమానాన్ని చూరగొన్నామని అన్నారు. దీంతో నక్సల్స్‌లో తీవ్ర నిరాశ అలముకుందని, వారి కార్యకలాపాలు సైతం తగ్గుముఖం పట్టాయని అన్నారు. రాయిపూర్ నుంచి ఢిల్లీ వరకు నక్సల్స్‌కు సానుభూతిపరులు ఉన్నారని, దీంతోనే వారికి నైతికంగా బలం చేకూరుతోందని అన్నారు. వారి తరఫున వాదించడానికి పెద్దపెద్ద న్యాయవాదులు ముందుకు వస్తారని, హైకోర్టు, సుప్రీం కోర్టులలో సైతం వారికి న్యాయసహాయం అందుతుందని, ఆర్థికపరంగా కూడా నక్సల్స్ పటిష్టంగా ఉన్నారని అన్నారు. అయితే ఈ సానుభూతిపరుల్లో సైతం త్వరలో ఉదాసీనత వస్తుందని, క్రమంగా వారు నిర్వీర్యులవుతారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు నక్సల్స్ బలహీనులైన విధంగానే త్వరలోనే వారి సానుభూతిపరులు సైతం తగ్గుముఖం పడతారని అన్నారు. సానుభూతిపరుల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. మానవహక్కుల పేరుతో కొందరు నక్సల్స్ చేసే హింసను సమర్థించడాన్ని ఆయన తప్పుపట్టారు. నక్సల్స్‌కు మాత్రమే మానవహక్కులు ఉంటాయా? వారి చేతుల్లో హత్యకు గురైన వారి పిల్లలు, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి, వారు స్కూళ్లను పడగొడుతున్నారు, రోడ్లను నాశనం చేస్తున్నారు ఇవన్నీ మానవహక్కుల ఉల్లంఘనకు రావా? అని తాను పౌరహక్కుల సంఘం వారిని ప్రశ్నించినట్టు సీఎం చెప్పారు. ఇటీవల కొంతమంది పౌరహక్కుల నేతలను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని ఆయన సమర్థించారు. 2025 నాటికి కొత్త చత్తీస్‌గఢ్ అన్న నినాదంతో తాము ప్రజల ముందుకు వెళ్తున్నామని, ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో తిరిగి తామే అధికారం చేపడతామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.