జాతీయ వార్తలు

శాస్ర్తీ మరణ రికార్డులు ప్రధాని ముందుంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ మరణానికి సంబంధించిన రహస్యాల వెల్లడికి అన్ని రికార్డులను ప్రధాన మంత్రి, హోంమంత్రి ముందు ఉంచాలని సెంట్రల్ ఇన్‌ఫర్‌మేషన్ కమిషన్ (సిఐసి) సోమవారం ఆదేశించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయంలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్‌ఫర్‌మేషన్ అధికారులకు, హోంమంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. తాష్కెంట్ ఒప్పందంపై సంతకాల నిమిత్తం సోవియట్ దేశానికి వెళ్లిన అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ ఒప్పందంపై సంతకాలు జరిగిన కొద్ది సేపటికే 1966, జనవరి 11న హఠాత్తుగా మరణించారు. గుండెపోటు వల్లే ఆయన మరణించారని వైద్య నివేదికలో వెల్లడించారు. అయితే అప్పటి నుంచి ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అసలు ఆయన మృతదేహానికి పరీక్షలు నిర్వహించారా? అంటూ సిఐసిలో ఆర్‌టిఐ కింద వచ్చిన దరఖాస్తుపై స్పందిస్తూ ఆయన మరణానికి సంబంధించిన రికార్డులన్నీ ప్రధాని, హోంమంత్రి కార్యాలయానికి ఇవ్వాలని ఆదేశించింది. మాజీ ప్రధాని మరణానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవాలనుకుని పౌరులు కోరుకోవడం వారి ప్రాథమిక హక్కు అని, ఈ నేపథ్యంలో రికార్డులన్నీ వర్గీకరించి, శాస్ర్తీ మరణం వెనుక రహస్యాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని సిఐసి తెలియజేసింది. అవసరమైతే దీనిపై నిపుణుల కమిటీ వేయడమో, మరో విధమైన పద్ధతులను అనుసరించో నిజాలను శోధించాలని సమాచార కమిషనర్ శ్రీ్ధర్ ఆచార్యులు కోరారు. శాస్ర్తీ మరణంపై విచారణకు 70లలో జనతాపార్టీ హయాంలో వేసిన రాజ్‌నరైన్ కమిటీ నివేదికకు సంబంధించిన రికార్డులు రాజ్యసభలో ఇప్పుడు లేకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో జరిగే ప్రతి పలుకు, ప్రతి కార్యక్రమం రికార్డురూపంలో మనకు లభ్యమవుతుందని, వీటిని ప్రతి ఒక్కరూ చూడవచ్చునని, అయితే అలాంటి వ్యవస్థలో, అంత ముఖ్యమైన రికార్డు సైతం మాయం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. రికార్డుల పరిరక్షణకు సంబంధిత యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇండో-పాక్ యుద్ధం అనంతరం 1965లో తాష్కెంట్ ఒప్పందంపై రష్యాలోని తాష్కెంట్‌లో శాస్ర్తీ సంతకం చేశారని, అది జరిగిన కొద్ది గంటలకే ఆయన కన్నుమూసారని, గుండపోటు వల్లే ఆయన మృతి చెందినట్టు వైద్య నివేదిక వెల్లడించినా, ఆయన మరణించిన పరిస్థితులు, ప్రదేశం, సమయం పలు అనుమానాలకు తావిస్తోందని మొదటి నుంచి పలువురు అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీనిపై పలువురు సమాచార హక్కు కింద వివరాలను సైతం కోరారు. అయితే ఇలాంటి రహస్యాలు వెల్లడించడం దేశ రక్షణ దృష్ట్యా సాధ్యం కాదని, సెక్షన్ 8(1) కింద ఇలాంటి సమాచారం ఇవ్వకుండా ఉంచే హక్కు చట్టం కల్పించిందని, దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు నష్టం కలిగించే వీటిని వెల్లడించలేమని కేంద్రంలోని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. మన దేశ ప్రధాని మరణానికి కారణాలు మనం తెలుసుకునే హక్కు ఉందని, ఈ వివరాల వెల్లడి సెక్షన్ 8(1) పరిధిలోకి రాదని, ఆయన మరణం వెనుక నిజాలు వెల్లడించాల్సిందేనని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పత్రాల వెల్లడికి అడుగుపడింది. నిజాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, శాస్ర్తీ మరణం వెనుక రహస్యాల వెల్లడికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సమాచార కమిషనర్ శ్రీ్ధర్ ఆచార్యులు అభిప్రాయపడ్డారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన పత్రాలను 2015, డిసెంబర్ నాలుగున ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించి చారిత్రాక నిర్ణయం తీసుకుందని చెప్పారు.