క్రైమ్/లీగల్

ఇప్పుడున్న చట్టాలు సరిపోవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని శరణాలయాల్లో బాలికలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని, ఈ నేరాలను అణచివేసేందుకు కొత్తగా బాలికల సంరక్ష విధానాలను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ అంశాలపై కొత్త పాలసీని తేవాలని కేద్ర మహిళా శిశుసంక్షేమ శాఖను ఆదేశించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ మదన్ బీ లోకూర్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నెల 8వ తేదీన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి కోర్టు ఎదుట హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. బాధితులకు కౌనె్సలింగ్ ఇవ్వడం, పునరావాస సదుపాయం కల్పించడం లాంటి చర్యలను వివరించాలని కోరింది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు, అమలు తీరు బాగాలేదని కోర్టు పేర్కొంది. ముజఫర్‌నగర్ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. బిహార్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఒక శరణాలయంలో 34 మంది బాలికలపై అత్యాచరాలకు పాల్పడిన ఘటనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని, 34 మంది బాలికలకు సరైన కౌనె్సలింగ్, ఓదార్పు అవసరమని పేర్కొంది. బాలికల సంరక్షణకు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని కోరామని, ఇంతవరకు స్పందన లేదనికోర్టు పేర్కొంది. గత విచారణలో మూడు రాష్ట్రాలు నివేదికలు ఇచ్చాయని కోర్టు పేర్కొంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్‌చైల్డ్ రైట్స్ అనే సంస్థ సోషల్ ఆడిట్ చేస్తున్నందు వల్ల మరి కొంత కాలం ఆగాలనే సమాధానం చెప్పరాదని కోర్టు కేంద్రాన్ని కోరింది. కేంద్ర సంయుక్త కార్యదర్శి హాజరై శరణాలయాల్లో బాలికల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోర్టు కేంద్రన్యాయవాదిని కోరింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న న్యాయవాది అపర్ణ భట్ వాదనలు వినిపిస్తూ, శరణాలయాల్లో ఉంటున్న బాలికలు, బాలురపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. ఇది ఒక ప్రధానమైన అంశమని, దీనిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఎన్‌సీపీసీఆర్ ఆడిట్ పది రాష్ట్రాల్లో జరుగుతోందని ఆమెతెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక శరణాలయంలో లైంగిక దాడులు జరిగాయన్న అంశాన్ని ఆమె ప్రస్తావించారు. కేంద్ర మహిళా సంక్షేమ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2015 నుంచి గత ఏడాది వరకు దేశంలోని వివిధ శరణాలయాల్లో 1575 మంది పిల్లలు లైంగిక దాడులకు గురయ్యారు.