జాతీయ వార్తలు

భూగోళ తాపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఇంచెన్ (సౌత్ కొరియా, అక్టోబర్ 8: రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులు అందరినీ కలవరపరుస్తోంది. ముఖ్యంగా భూగోళంపై పెరుగుతున్న తాపం ఆందోళన కలిగిస్తోంది. భూగోళం తాపం కనుక మరో రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగితే భారత్ తీవ్ర వడగాల్పులతో అల్లాడుతుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఫర్ క్లయిమేట్ చేంజ్ (ఐపీసీసీ) సోమవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. వాతావరణ మార్పులతో ప్రపంచానికి సంభవించే పెనుముప్పును నివారించడానికి సామాజికంగా, ప్రపంచ ఆర్థికవ్యవస్థలో అనూహ్యమైన మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇప్పుడున్న వాతావరణానికి అదనంగా 1.5 డిగ్రీల సెల్సియస్ వేడి కనుక పెరిగితే నైజీరియాలోని లాగోస్, చైనాలోని షిల్లాంగ్ లాంటి నగరాలు వేడితో అల్లాడుతాయని, అదే కనుక రెండు డిగ్రీలు పెరిగితే పాకిస్తాన్‌లోని కరాచి, భారత్‌లోని కోల్‌కతా లాంటి నగరాలు 2015లో వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి అయిన పరిస్థితి లాంటిదే సంభవిస్తుందని తెలిపింది. భూగోళ తాపం ప్రభావం ప్రాంతాల వారీగా మారుతుందని, దక్షిణాసియా ప్రాంతంలోని పాకిస్తాన్, ఇండియా, చైనా, మిడిల్ ఈస్ట్, పశ్చిమ ఆసియా ప్రాంత దేశాలపై మరోవిధంగా ఉంటుందని పేర్కొంది. రోజురోజుకు మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూగోళానికి పెనుముప్పు రోజురోజుకు పెరుగుతోందని, దీని నివారణకు ఎంతో సమయం లేనందున మనం ఇప్పటినుంచే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. భూగోళం తాపం ఒక డిగ్రీ సెల్సియస్ కనుక పెరిగితే సముద్రాలు పొంగుతాయని, తుపానులు, వరదలతో పాటు తీవ్ర కరవు కూడా ఏర్పడుతుందని, అదే కనుక మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగితే పరిస్థితిని ఊహించలేమని పేర్కొంది. 2030 నాటికి మనం వదిలే గ్రీన్ హౌస్ గ్యాస్‌ను స్థాయికి 1.5సికి తగ్గించగలమని ఐపిసిసి తన నివేదికలో విశ్వాసం వ్యక్తం చేసింది. మానవ చరిత్రలో రాబోవుకొద్ది సంవత్సరాలు అతి ముఖ్యమైనవని డర్బన్‌కు చెందిన ఎన్విరాన్‌మెంటర్ ప్లానింగ్ అండ్ క్లయిమేట్ ప్రొటక్షన్ హెడ్ డెబ్రా రాబర్ట్స్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులు, దానివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను వివరిస్తూ 400 పేజీల నివేదిక విడుదల చేశారు. లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ జిమ్‌స్కీ మాట్లాడుతూ పర్యావరణ మార్పుల వల్ల సంభవించే ఇబ్బందుల గురించి వెల్లడించామని, 2015లో చేసుకున్న ప్యారిస్ ఒప్పందం ప్రకారం ప్రభుత్వాలే దీనిపై స్పందించాలని అన్నారు.
దాదాపు శతాబ్దం పాటు శాస్ర్తియంగా చేసిన పరిశోధనలతో భూతాపాన్ని రెండు డిగ్రీల సెల్సియస్‌కు కనుక తగ్గించగలిగితే ప్రపంచంలో సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుందని నిర్ధారించినట్టు ఐపిసిసి పేర్కొంది. భూగోళ తాపం పెరగడం వల్ల తాము ఊహించినదానికన్నా అధికంగానే ముంచుకొస్తున్నాయని ఐపీసీసీ పేర్కొంది. భవిష్యత్‌లో జరుగుతాయని శాస్తవ్రేత్తలు అంచనా వేసి చెప్పిన పెనువిపత్తులు ఇప్పుడు సంభవిస్తున్నాయని గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెన్నిఫర్ మోర్గాన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2050 నాటికి భూగోళంపై ఉన్న వాతావరణాన్ని కనీసం 1.5 సెంటీగ్రేడ్ తగ్గించగలిగి కార్బన్ న్యూట్రల్‌గా ఉంచగలిగితే ప్రపంచం సురక్షితంగా ఉండటానికి 50-50 అవకాశాలు ఉంటాయని ఒక నివేదిక పేర్కొంది. అంటే మనం వాతావరణంలోకి ఒకటన్ను కార్బన్‌డయాక్సైడ్‌ను కనుక వదిలితే అదే పరిణామంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను మనం తగ్గించగలగాలని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన క్లయిమాట్ రీసెర్చి ప్రోగ్రామ్ హెడ్ మైలెస్ అల్లెన్ తెలిపారు.
వాతావరణాన్ని మనం సురక్షితంగా ఉంచగలిగితే మానవుడి సుఖమయ జీవనానికి ఎలాంటి ఆటంకం కలగదని, దానిని నిర్లక్ష్యం చేస్తే అనూహ్య పరిణామాలు సంభవించే మానవాళికి తీవ్ర నష్టం జరుగుతుందని పలువురు వాతావరణ నిపుణులు ఈ సందర్భంగా హెచ్చరించారు.