జాతీయ వార్తలు

సత్తా ఉన్నవారికే టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, అక్టోబర్ 15: గెలిచే వారికే టిక్కెట్లిస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే రైతులు, యువకుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ వెల్లడించారు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ పరాజయాన్ని చవిచూసినప్పటికీ మేం ప్రజలతో మమేకమయ్యే ఉన్నామని, అయితే బీజేపీ మాత్రం ప్రజాభిమానానికి దూరమయిందని, ఇక తమ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా తుది దశలో ఉందని, ఆయా నియోజకవర్గాల్లో గెలిచే సత్తా ఉన్నవారికే టిక్కెట్లు కేటాయిస్తామని పైలెట్ స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సమస్యలపైనే దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రైతులకు రుణాలు సరిగా అందడం లేదని, మద్దతు ధర లభించడం లేదని, సరైన సమయంలో నాణ్యత గల విత్తనాలు లభించడం లేదని ఇలాంటి అనేక సమస్యలతో రైతు సతమతమవుతున్నాడని, ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తామని సచిన్ పైలెట్ పేర్కొన్నారు. నిరుద్యోగు లందరికీ ఉపాధి కల్పిస్తామని, అది సాధ్యం కాకుంటే చదువు పూర్తయిన వారికి స్వయం ఉపాధి కోసం తక్కువ రేటుకే రుణాలు అందజేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే నిరుద్యోగులున్న కుటుంబాలకు రూ.3500లు అలవెన్సు కింద అందజేస్తామని అన్నారు. ఇలాంటి అన్ని హామీలను తమ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దళితులకు, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2013లో అధికారం చేపట్టిన వసుంధర రాజె ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటికీ తిలోదకాలిచ్చారని, విద్య, ఆరోగ్యం తదితర ప్రజావసర సేవలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేస్తున్నారని దుయ్యబట్టారు. గనులను లీజులకు ఇచ్చుకోవడం, ప్రభుత్వం చేయాల్సిన సేవలను ఒక్కొక్కటిగా ప్రైవేటు వారికి అప్పగించడంలో చూపిస్తుఉన్న ఉత్సాహం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చూపడం లేదని దుయ్యబట్టారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు 150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్ర మాజీ మంత్రి కూడా అయిన సచిన్ పైలెట్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.