జాతీయ వార్తలు

భారతీయులందరిదీ గుజరాత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 15: గుజరాత్ భారతీయులందరిదీ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సోమవారం నాడక్కడ పేర్కొన్నారు. ఆ రాష్ట్రానికి వలస వెళ్లిన హిందీ మాట్లాడే వారిపై దాడులు జరిగిన కొన్ని రోజులకు ముఖ్యమంత్రి స్పందిస్తూ పైవిధంగా అన్నారు. ప్రజలందరి మర్యాద రక్షణకు, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. 14 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశాడన్న నేరారోపణపై ఈనెలారంభంలో బీహారునుంచి వలస వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన క్రమంలో గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా వలస కూలీలపై దాడులు జరిగాయి. ప్రత్యేకించి బీహారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై అధికంగా దాడులు జరిగాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ‘గుజరాత్ మహాత్మాగాంధీ, సర్థార్ వల్లభాయ్ పటేల్, ప్రధాని మోదీకి సొంతరాష్ట్రం, దేశమంతా మనకు ఒక్కటే, అలాగే గుజరాత్ రాష్ట్రం కూడా భారతీయులందరికీ చిన్నదేశం లాంటిదే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి బీహారు, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు కూడా దోహదం చేశారన్నారని లక్నోలో రెండోరోజు పర్యటన సందర్భంగా విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. నర్మదానది ఒడ్డున ‘స్టాచూ ఆఫ్ యూనిటీ’ పేరిట నిర్మించిన సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహావిష్కరణ ఈనెల 31న జరుగనున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానం మేరకు రూపానీ ఆదివారం లక్నోకు చేరుకున్నారు. సోమవారం ఇక్కడి ఇందిరాగాంథీ ప్రతిష్టాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఎలాగైతే పాలు, చక్కెర కలిసిపోతాయో అలాగే దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సూరత్, అహ్మదాబాద్, కచ్, బరోడాల్లో ప్రశాంత జీవనం గడుపుతూ గుజరాత్ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నార’ని అన్నారు.

చిత్రం..లక్నోలో జరిగిన ఓ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి రూపానీకి జ్ఞాపికను అందిస్తున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్