జాతీయ వార్తలు

వీడని విపత్తు జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, అక్టోబర్ 15: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లోనూ, ఆ పరిసర ప్రాంతాల్లోనూ ఐదేళ్ల క్రితం విరుచుకుపడిన వరదల తాలూకు భయంకర జ్ఞాపకాలు ఇంకా వెన్నాడుతూనే వున్నాయి. ఆ పెనువిపత్తులో మృత్యువాత పడిన వ్యక్తుల అస్థిపంజరాలు ఇప్పటికీ వెలుగుచూస్తున్నాయి. తాజాగా పోలీసులు జరిపిన మూడు రోజుల గాలింపు చర్యల్లో మరికొందరు బాధిత భక్తుల అస్థిపంజరాలు బయల్పడ్డాయి. హిమాలయాల పరిసరాల్లో జరిపిన గాలింపు చర్యల్లో తమ పోలీసు బృందాలకు సుమారు 21 అస్థిపంజరాలు, రెండు పుర్రెలు లభ్యమయ్యాయని పోలీసు అదనపుడైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ సోమవారం పీటీఐకి తెలిపారు. ఐదు పోలీసు బృందాలను ఏర్పాటుచేసి హిమాలయ పర్వత పరిసరాల్లోని వివిధ మార్గాల్లో సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ప్రతి బృందానికి ఓ ఎస్పీ స్థాయి అధికారి నాయకత్వం వహించారన్నారు. ఈ బృందాలు కనుగొన్న అస్థిపంజరాల నుంచి డీఎన్‌ఏను సేకరించి అక్కడికక్కడే లాంచనాలతో ఆదివారం నాడు అంత్యక్రియలు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. కేదార్‌నాథ్ ఆలయానికి కొండదారి గుండా ఎక్కివెళ్లే రాంబారా, త్రిజుగనారాయణ ప్రాంతాల్లో అధికంగా ఈ అస్థిపంజరాలు లభ్యమైనట్లు ఆయన వెల్లడించారు. కేదార్‌నాథ్‌కు వెళ్లే యాత్రికులకు రాంబారా ఓ సేదతీరే ప్రధాన విడిదిలాంటిది. వరదలు హఠాత్తుగా ముంచుకొచ్చిన సమయంలో ఇక్కడ అనేక మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరదల్లో ఈ ప్రాంతం మొత్తం తుడుచిపెట్టుకుపోయింది. అప్పటి వరదల్లో మృత్యువాత పడిన ఎంతోమంది మృతదేహాలు హిమాలయ పర్వత పరిసరాల్లో కూరుకుపోయి వుండవచ్చని, అక్కడ మళ్లీ తనిఖీలు నిర్వహించాలని 2016లో హైకోర్టు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన దరిమిళా ఈనెల 12న పోలీసులు తాజాగా తనిఖీలు చేపట్టారు. ఆ వరద బీభత్సంలో సుమారు 3500 మంది వరకు గల్లంతయ్యారని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ విపత్తు తర్వాత కేవలం 450 మంది భక్తుల మృత దేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. 2013లో కేదార్‌నాథ్‌లో జరిగిన ఈ విపత్తు తర్వాత మూడేళ్లకు 2016 అక్టోబర్‌లో రుద్రప్రయాగ జిల్లాలోని త్రిజుగనారాయణ్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో జరిపిన తనిఖీల్లో సుమారు 31 అస్థిపంజరాలను పోలీసు తనిఖీ బృదాలు కనుగొన్నాయి. హిమాలయ పర్వతాల సమీపంలో చౌరాబారీ సరస్సుకు నిర్మించిన ఆనకట్ట భారీ వర్షాల కారణంగా తెగిపోవడంతో మృత్యు దేవతలా ముంచుకొచ్చిన వరద వేలాది మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే.