జాతీయ వార్తలు

చెప్పేదొకటి..చేసేదొకటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాతియా(మధ్యప్రదేశ్), అక్టోబర్ 15:ప్రధాని నరేంద్ర మోదీకి దేశంలోని పేదల స్థితిగతులు పట్టవని, నీరవ్‌మోదీ, అనీల్ అంబానీ, ఛోక్సీలతో సంబంధాలే ఆయనకు ముఖ్యమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న రాహుల్ రాఫెల్ వ్యవహారంతో పాటు నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకు దక్కాల్సిన ఈ యుద్ధ విమానాల కాంట్రాక్టును అంబానీ సంస్థకు ఎందుకు కట్టబెట్టారన్న దానిపై మోదీ నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. దేశంలో మహిళలకు తగిన రక్షణ లేదని, ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న హామీలన్నీ నిస్సారమైనవేనన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచే మహిళలకు రక్షణ కల్పించాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు. ఉన్నావ జిల్లాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ బీజేపీ ఎమ్మెల్యే ఉదంతాన్ని రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నీరవ్ మోదీని నీరవ్ భాయ్, చోక్సీని మెహుల్ భాయ్, అనీల్ అంబానీని అనీల్ భాయ్ అని సంబోధించే మోదీ ఎప్పుడైనా ఓ పేద రైతును, ఓ పేద కార్మికుడ్ని అక్కున చేర్చకుని భాయ్ అంటూ సంబోధించారా అని రాహుల్ ప్రశ్నించారు. ఇందుకు కారణం మోదీ హృదయంలో వీరిక ఎలాంటి ప్రాధాన్యతా లేకపోవడమేనంటూ విమర్శలు గుప్పించారు. సూటుబూటు వేసుకోని ఎవరూ కూడా మోదీకి భాయ్ కాదంటూ రాహుల్ వ్యంగ్యోక్తి విసిరారు. గుజరాత్‌లో దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా మోదీకి పట్టదని, అలాగే మహిళలు, బలహీన వర్గాలు అన్యాయాలకు గురవుతున్నా ఆయన పట్టించుకోరని రాహుల్ పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు తాను దేశానికి చౌదీదార్‌నని పేర్కొన్న మోదీ నాలుగేళ్ల పాలనలో 20మంది పారిశ్రామిక వేత్తలే బాగుపట్డారని రాహుల్ అన్నారు. రైతులు, పేదలకు ఈ నాలుగేళ్లలో జరిగిందేమీ లేదని, వారి ఆవేదన అరణ్య రోదనే అయిందంటూ మోదీ సర్కార్‌పై నిప్పుల చెరిగారు. 35వేల కోట్ల రూపాయలతో దేశం వదిలి నీరవ్ మోదీ పారిపోవడానికి మోదీ సహకరించారని, ఈ మొత్తం మహాత్మా గాంధీ గ్రామీణ అభివృద్ధి పథకానికి కేటాయించిన మొత్తం నిధులతో సమానమని అన్నారు. 45వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ రంగ సంస్థలకు బాకీ పడ్డ అనీల్ అంబానీకే రాఫెల్ కాంట్రాక్టు దక్కేలా మోదీ సహకరించారని రాహుల్ ఆరోపించారు. హాల్‌కు దక్కాల్సిన ఈ కాంట్రాక్టు ఏ మాత్రం అనుభవం లేని అనీల్ అంబానీ సంస్థకు ఎలా వచ్చిందన్న తన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి లేదన్నారు.
ఎన్డీయే పాలనకు ముందు దేశంలో సాగిన వివిధ పార్టీల పాలనను విమర్శించడం ద్వారా ప్రధాని మోదీ ప్రతి భారతీయుడ్ని అవహేళన చేస్తున్నారని రాహుల్ ఎదురుదాడి చేశారు. తాను ప్రధాని పదవిని చేపట్టడానికి ముందు వరకూ దేశం నిద్ర పోతోందంటూ మోదీ అనడం ప్రతి భారతీయుడ్ని అవమానించడం కాదా అని రాహుల్ ప్రశ్నించారు.

చిత్రం.. మధ్యప్రదేశ్‌లోని దాతియాలో సోమవారం ఓ బహిరంగ సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ