జాతీయ వార్తలు

చమురు రేటు.. వృద్ధికి చేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ముడి చమురు ధరల వల్ల వృద్ధి రేటుకు తీవ్ర విఘాతం కలుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ముడి చమురు రేటును సహేతుక స్థాయికి తగ్గించేందుకు సౌదీ అరేబియా ఉత్పత్తిదారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ చమురు సహజ వాయువుకంపెనీల సీఈవోలతో సోమవారం ఇక్కడ జరిగిన మూడో వార్షిక సమావేశంలో మోదీ మాట్లాడారు. ముడి చమురు ధరలు అపరిమితంగా పెరిగిపోవడం వల్ల భారత్ వంటి భారీ వినియోగదేశాలు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నాయని అన్నారు. ముడిచమురు ధరలు దేశంలో ఇప్పటికే పెట్రోల్,డీజిల్, ఎల్‌పీజీ ధరలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. గత నాలుగేళ్లుగా ఎన్నడూ లేని రీతిలో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి గాడితప్పే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని, భారత్ వంటి వర్ధమాన దేశాల బడ్జెట్‌లు కూడా దెబ్బతింటున్నాయని మోదీ
ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా భారత్‌లో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ముడిచమురు, గ్యాస్ అనే్వషణ రంగంలో ఎందుకు కొత్తగా పెట్టుబడులు రావడం లేదని మోదీ ఈ సందర్భంగా ప్రశ్నించారు. సమావేశంలో మాట్లాడిన సౌదీ అరేబియా చమురు మంత్రి ఖాలిద్ ‘చమురు ధరలపై అన్ని దేశాల ఆందోళనలను మేం విన్నాం. ముఖ్యంగా వినియోగదారులకు కలుగుతున్న ఇబ్బందుల గురించి మోదీ మాట్లాడారు’అని తెలిపారు. ఇప్పటికే సౌదీ అరేబియా ఇందుకు సంబంధించి అనేక నిరోధక చర్యలు తీసుకుందని లేనిపక్షంలో ముడిచమురు ధరలు మరింతగా పెరిగిపోయి ఉండేవన్నారు. చమురు వినియోగదారులు తమకు అత్యంత కీలకమని వారిని దూరం చేసుకోవడం ఎవరికీ తగదని ఖాలిద్ తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడిన భారత్ చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధిక చమురు ధరల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. డాలరు మారకంలో 50 శాతం, భారత రూపాయి మారకం విలువలు 70 శాతం గత ఏడాది చమురు ధరలు పెరిగాయన్నారు. ఇండియా ఎనర్జీ ఫోరం పేరిట జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి జైట్లీ, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇంధన, గ్యాస్ రంగంలో కొత్తగా పెట్టుబడులను ఆహ్వానించడానికి తీసుకోవల్సి చర్యలపై చర్చించారు.