జాతీయ వార్తలు

పిల్లల మరణాలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షియోపూర్ (మధ్యప్రదేశ్), అక్టోబర్ 16: మధ్యప్రదేశ్‌లో పోషకాహార లోపంతో చిన్న పిల్లలు చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బాధ్యతను విస్మరించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తనకు తాను మార్కెటింగ్ చేసుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. నవంబర్ 28న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ మంగళవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ రాష్ట్రంలో పోషకాహార లోపంతో చిన్న పిల్లలు చనిపోతుండగా, గిట్టుబాటు ధర లేక తీసుకున్న రుణాలు చెల్లించలేని దుస్థితిలో రైతులు, నిరుద్యోగ సమస్యతో యువత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన నిప్పులు చెరిగారు. షియోర్‌పూర్ నగరంలో మంగళవారం నిర్వహించిన ఒక ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 3ఇక్కడ పోషకాహార లోపంతో చిన్న పిల్లలు చనిపోతున్నారు. అయినా ఈ సమస్యను పరిష్కరించడానికి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కృషి చేయడం లేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం తనకు తాను మార్కెటింగ్ చేసుకోవడంలో బిజీగా ఉంది. ముఖ్యమంత్రి ఫొటోలతో వ్యాపార ప్రకటనలు (అడ్వర్టయిజ్‌మెంట్లు) జారీ చేస్తోంది2 అని రాహుల్ గాంధీ నిశితంగా విమర్శించారు. 3పిల్లలు చనిపోతుంటే ముఖ్యమంత్రి ఏమీ చేయడం లేదు2 అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ 15 ఏళ్ల కాలంలో రైతులు, యువత కోసం ఏమీ చేయలేదని రాహుల్ గాంధీ అన్నారు. 3నేను మీకు ఎలాంటి తప్పుడు హామీలు ఇవ్వను. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగిస్తే రైతుల రుణాలను రద్దు చేస్తామని నేను భరోసా ఇస్తున్నాను2 అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్‌కు అనుభవం ఉందని, సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాకు బలం ఉందని రాహుల్ అన్నారు. 3కాంగ్రెస్ పార్టీ కోసం వారిద్దరు కలిసి పనిచేస్తారు2 అన్నారు.
పెదవి విప్పవేం మోదీ
మోరెనా: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా విరుచుకుపడ్డారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ మోదీపై రాహుల్ దాడికి దిగారు. 3మోదీజీ 3బేటీ పఢావో, బేటీ బచావో2 అని చెబుతుంటారు. కాని, తన మంత్రివర్గంలోని ఓ మంత్రిపై లైంగిక దాడి ఆరోపణలు వస్తే మాత్రం ఆయన పెదవి విప్పరు2 అని రాహుల్ గాంధీ విమర్శించారు. మోరెనా జిల్లా జౌరా ప్రాంతంలో జరిగిన ఒక ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ ఎంజే అక్బర్‌పై పలువురు మహిళా జర్నలిస్టులు చేసిన లైంగిక దాడి ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే, తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలను అక్బర్ ఇప్పటికే ఖండించారు. 3ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళను బీజేపీ ఎమ్మెల్యే రేప్ చేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి (ఆదిత్యనాథ్) వౌనంగా ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వౌనంగా ఉంటారు. వారి నిజమయిన నినాదం ఇలా ఉండాలి 3బేటీ పఢావో ఔర్ బేటీ కో బీజేపీ కే నేతా, మంత్రి ఔర్ ఎమ్మెల్యేసే బచావో2 అని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలోకి వస్తే ప్రజలకు చౌకీదార్‌లాగా పని చేస్తానని మోదీ అప్పట్లో అన్నారని, కాని, అధికారంలోకి వచ్చాక ఆయన అనిల్ అంబానీ, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలకు చౌకీదార్‌నని నిరూపించుకున్నారని, గత నాలుగేళ్లుగా వారికోసమే పని చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు.