జాతీయ వార్తలు

పిడిపి ఎమ్మెల్యేపై అల్లరి మూకల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 18: అల్లర్లతో అట్టుడుకుతున్న కాశ్మీర్‌లో సోమవారం కూడా పది జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో వుంది. ఆదివారం రాత్రి పిడిపి ఎమ్మెల్యే మహమ్మద్ ఖలీల్ బంద్‌పై ఒక గుంపు రాళ్లతో దాడికి దిగింది. దీంతో ఆ ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ కొన్నిచోట్ల రాళ్లు రువ్విన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ‘ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఇంకా కర్ఫ్యూ అమలులోనే ఉంది’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మూడవ రోజైన సోమవారం కూడా వార్తాపత్రికలు వెలువడలేదు. మొబైల్, ఇంటర్‌నెట్ సర్వీసులు గత ఎనిమిది రోజులుగా పనిచేయడం లేదు. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్‌కౌంటర్ జరిగిన అనంతరం కాశ్మీర్‌లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దీన్ని ఆసరా చేసుకుని వేర్పాటు వాదులు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

చిత్రం.. శ్రీనగర్‌లోని లాల్‌దేడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి బంధువులకు ఆసుపత్రి వెలుపల ఆహారాన్ని అందిస్తున్న దృశ్యం