జాతీయ వార్తలు

జాతీయ పార్టీలను ఓడిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, అక్టోబర్ 16: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సీపీఎం సహా ఎడు పార్టీలు ‘రాజస్తాన్ లోక్ తాంత్రిక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) పేరుతో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలో సీపీఎంతో పాటు జనతాదళ్, జనతాదళ్ ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఐ (ఎంఎల్), రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు వున్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించడటమే ధ్యేయంగా తాము ఈ కూటమిని ఏర్పాటు చేశామని సీపీఎం నాయకుడు రవీంద్ర శుక్లా తెలిపారు. ఈ రెండు జాతీయ పార్టీల వల్ల రైతులు, కార్మికులు, దళితులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆయన ఆరోపించారు. 200 స్థానాలు కలిగిన అసెంబ్లీలో సీపీఎం 29 సీట్లకు పోటీ చేస్తుందని తెలిపారు. ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలన్న దానిపై కూటమి భాగస్వామ్యాల మధ్య త్వరలోనే సమావేశం జరుగుతుందన్నారు.