జాతీయ వార్తలు

మహారాష్ట్ర అసెంబ్లీని కుదిపేసిన అత్యాచారం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జూలై 18: అహ్మద్ నగర్ జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం వ్యవహారం మహారాష్ట్ర ఉభయసభలను స్తంభింపజేసింది. సోమవారం నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో తొలిరోజే కాంగ్రెస్, ఎన్‌సిపిలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నాయి. పదిహేనేళ్ల అమ్మాయిపై గతవారం ముగ్గురు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి అతికిరాతకంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి ఫడ్నవిస్ సర్కారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు అసెంబ్లీలో పట్టుబట్టాయి. ప్రధాన ప్రతిపక్షం ఎన్‌సీపీ నేత ధనుంజయ్ ముండే వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ స్పీకర్ దాన్ని తిరస్కరించారు. మండలిలో కాంగ్రెస్ నేత నారాయణ్ రాణె రాష్ట్ర హోం శాఖ మొద్దునిద్ర పోతోందని ఆరోపించారు. ఈ నేరంలో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారని, ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ అనంతరం ఫడ్నవిస్ తెలిపారు. ప్రఖ్యాత న్యాయవాది ఉజ్జ్వల్ నికమ్‌ను ఈ కేసు వాదనలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించామని సిఎం వివరించారు. బాధితురాలి కుటుంబానికి అయిదు లక్షల రూపాయలు పరిహారంగా ఇస్తున్నట్లు కూడా ఫడ్నవిస్ వెల్లడించారు. బాధితురాలి డిఎన్‌ఏ నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు వివరించారు.

చిత్రం.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సోమవారం విధాన భవన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మహారాష్ట్ర ప్రతిపక్ష ఎమ్మెల్యేలు