జాతీయ వార్తలు

నేడు లోక్‌సభకు ‘నీట్’ బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: రాష్ట్రాల బోర్డులను ఈ సంవత్సరం ఏకీకృత మెడికల్ అండ్ డెంటల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నీట్ పరిధిలోకి రాకుండా ఉంచేందుకు జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నది.
ఆర్డినెన్సుల స్థానంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్- 1956ను సవరించడానికి ద ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (అమెండ్‌మెంట్) బిల్లు- 2016ను, ద డెంటిస్ట్స్ యాక్ట్- 1948ని సవరించడానికి ద డెంటిస్ట్స్ (అమెండ్‌మెంట్) బిల్లు- 2016ను కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా మంగళవారం దిగువ సభలో ప్రవేశపెడతారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎస్‌ఎస్ అహ్లూవాలియా కూడా ఈ రెండు ఆర్డినెన్స్‌ల ప్రతులను సభలో ప్రవేశపెడతారు. జూన్‌లో మృతిచెందిన బిజెపి ఎంపి దల్‌పత్ సింగ్ పరస్తేకు సోమవారం సంతాపం ప్రకటించిన అనంతరం ఆయన గౌరవార్థం సభ మంగళవారానికి వాయిదా పడింది. దీంతో సోమవారం చేపట్టవలసి ఉండిన అజెండాలోని కార్యక్రమాలను సభ మంగళవారం చేపడుతుంది. అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు రాష్ట్రాల బోర్డులు ఈ సంవత్సరం నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరిధిలోకి రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మే నెలలో రెండు ఆర్డినెన్స్‌లను జారీ చేసిన విషయం తెలిసిందే.

చిత్రం.. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న మహిళా సంఘాల కార్యకర్తలు