జాతీయ వార్తలు

బిజెపికి సిద్దు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: పంజాబ్‌కు చెందిన సీనియర్ నాయకుడు, నవజ్యోత్‌సింగ్ సిద్దు సోమవారం రాజ్యసభ సభ్యత్వంతోపాటు బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ క్రికెటర్ సిద్దు నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు షాక్ ఇచ్చేదే. సిద్దు త్వరలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీలో చేరడంతోపాటు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రంగ ప్రవేశం చేయన్నుట్లు తెలిసింది. నవజ్యోత్‌సింగ్ సిద్దు రాజీనామాతో పంజాబ్‌లో బిజెపి, అకాలీదళ్ రాజకీయంగా దెబ్బతినగా ఆమ్‌ఆద్మీ పార్టీకి రాజకీయంగా బాగా కలిసి వస్తుంది. అందుకే సిద్దు రాజీనామాతో బిజెపి, అకాలీదళ్ బెంబేలెత్తుతున్నాయి. అలాగే ఆయన భార్య కూడా బిజెపికి రాజీనామా చేశారు. ప్రముఖ క్రికెటర్, టివి సెలబ్రిటీ అయన సిద్దు రాజ్యసభ సభ్యత్వంతోపాటు బిజెపికి రాజీనామా చేయటంపై పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో చర్చనీయాంశంగా మారింది. కేవలం మూడు నెలల క్రితమే సిద్దును రాజ్యసభకు నామినేట్ చేసిన బిజెపి అధినాయకత్వం ఆయనను వచ్చే సంవత్సరం జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో రాజీనామా చేయటం ఆందరినీ ఆశ్చర్య పరిచింది. గత ఏప్రిల్‌లో రాజ్యసభకు నామినేట్ అయిన సిద్దు చాలా కాలం నుండి బిజెపి అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీర్పు పట్ల అసంతృప్తితో ఉన్నారు.
కాగా పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వారికి అభిమతానికి అనుగుణంగా మార్చు తేవడానికి ప్రయత్నిస్తానని రాజ్యసభకు రాజీనామా చేసిన అనంతరం ఆయన విలేఖరులతో అన్నారు. ‘రాజ్యసభ సభ్యత్వం నాకు భారంగా మారింది. పంజాబ్ ప్రయోజనాలను ఈ భారం దెబ్బతీస్తోంది. అందుకే రాజీనామా చేశాను’అని సిద్దు వెల్లడించారు. మంచికి, చెడుకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు తటస్థంగా ఉండటం సాధ్యం కాదని, అందుకే పంజాబ్ ప్రయోజనాల పరిరక్షణ కోసం పని చేస్తానని మాజీ క్రికెటర్ ప్రకటించారు. సిద్దు త్వరలోనే కేజ్రీవాల్‌ను కలుస్తారని తెలిసింది.