జాతీయ వార్తలు

కేరళపై కేంద్రం వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 22: కేంద్ర ప్రభుత్వం వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడంలో వివక్ష చూపుతోందని కేరళ ముఖ్యమంత్రి పీ విజయన్ విమర్శించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు కేంద్రం తగిన సాయం చేయడం లేదని సోమవారం ఇక్కడ ఆరోపించారు. అమ్మపెట్టదు, అడుక్కు తిననీయదన్న సామెతగా కేంద్రం తీరు ఉందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కేరళపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. నిధుల సమీకరించుకోకుండా మోదీ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన అన్నారు. యూఏఈలో ఐదురోజుల పర్యటన ముగించుకుని ఉదయం ఆయన కేరళ చేరుకున్నారు.‘కేంద్ర ప్రభుత్వ కేరళపై వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది. నిధులు రాకుండా అడ్డంకులు సృష్టిస్తోంది’అని విజయన్ దుయ్యబట్టారు. అదే గుజారాత్ అయితే విదేశీ నిధులకు తరుపులు బార్లా తెరుస్తారని ఆయన విరుచుకుపడ్డారు.‘మేం అయితే ఏ దేశం నుంచి సాయం తీసుకోకూడదు. మరో రాష్ట్రానికి అయితే ఇలాంటి ఆంక్షలు వర్తించవు’అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో వరద పనులకు 700 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని యూఏఈ ముందుకొచ్చిందన్న విజయన్ ‘ఇందులో ఎలాంటి దాపరికం లేదు. అయితే కేంద్రం మోకాలొడ్డింది’అని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకురావాలన్న దృష్టితోనే పర్యటన చేశానని కేరళ సీఎం వెల్లడించారు. సాయం కూడా ఎక్కువగానే ఉంటుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. కేరళను ఆదుకోడాకి సంస్థల ముందుకొస్తున్నా కేంద్రం ఆటంకాలు కల్పిస్తోందని వాపపక్ష ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతున్నాయి. గల్ఫ్ సహా ఐరోపా దేశాలకు మంత్రులను పంపి నిధులు సేకరించాలని కేరళ సీఎం ప్రయత్నించగా కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఇటీవల వరదలు, భారీ వర్షాలను కేరళ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ఈ విపత్తులో 493 మంది మృతి చెందారు. ఆస్తినష్టం అపారంగా ఉంది. ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి మరింత సాయం తీసుకోవాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.