జాతీయ వార్తలు

కొనసాగిన ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంబ(కేరళ), అక్టోబర్ 22: సుప్రీం కోర్టు తీర్పు అనంతరం శబరిమలలో తలెత్తిన ఉద్రిక్తతలు కొనసాగాయి. సోమవారం ఓ మహిళ శబరిమల కొండపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేసింది. అయ్యప్ప భక్తులు ఆమె ప్రయత్నాలను వమ్ముచేశారు. నెలవారీ పూజల తరువాత రాత్రి పది గంటలకు ఆలయం ద్వారాలు మూసివేయనున్నట్టు ప్రకటించిన దృష్ట్యా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. బిందు అనే దళిత కార్యకర్త కొండపైకి వెళ్లేందుకు యత్నించింది. అప్పటికే వేచి ఉన్న నిరసనకారులు ఆమెను ముందుకెళ్లనీయలేదు. భద్రత కల్పించేందుకు పోలీసులు సంసిద్ధత వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో పోలీసుల భద్రత మధ్య బిందు పంబకు చేరుకుంది. అయితే బీజేపీ కార్యకర్తలు, భక్తులు రోడ్డుపై బైఠాయించి ఆమె ప్రయత్నాలను వమ్ముచేశారు. చేసేది లేక ఆమెను పోలీసు జీపులో వెనక్కి తీసుకెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఆందోళనకారులకు భయపడి కనీసం డజను ముంది మహిళలు దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. ఐదురోజుల నెలవారీ పూజల నిమిత్తం ఈనెల 17న ఆలయాన్ని తెరిచారు. తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తొలి రోజు ఎలాంటి పూజలు జరగలేదు. వందలాది మంది భక్తులు శబరిమల సన్నిధానం ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. 10-50 మధ్య వయస్కులైన మహిళలకు ఆలయ సంప్రదాయల ప్రకారం ప్రవేశం లేదు. అయితే ఇటీవలే వారికీ అనుమతిని ఇస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీన్ని హిందూ సంస్థలు, భక్తులు జీర్ణించుకోలేకపోయారు. మహిళల ప్రవేశాన్ని ఆందోళనకారులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును అమలుచేస్తామని ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శబరిమల సిన్నిధానం, పంబ, నీలక్కల్, ఎలవుమక్కల్‌లో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఆలయ ప్రవేశానికి సామాజిక కార్యకర్తలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందుకున్న సన్నిధానం తదితర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. కొండపై ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండా చూసేందుకు ఐజీ ఎస్ శ్రీజిత్ పర్యవేక్షణలో బలగాలు పనిచేశాయి. అయితే ఐజీ తీరుపై భక్తులు మండిపడ్డ సందర్భాలున్నాయి. సామాజిక కార్యకర్తల రెహానా ఫాతిమాకు పోలీసు భద్రత కల్పించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. కొండపై భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో రెహానా ఆలయంలోకి వెళ్లలేకపోయింది. ఆదివారం ఒక్కరోజే ఆలయంలోకి వెళ్లాలనుకున్న ఆరుగురు మహిళలను నిరసనకారులు అడ్డుకున్నారు.