జాతీయ వార్తలు

జాతీయ విపత్తుగా ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బీభత్సాన్ని సృష్టించిన తిత్లీ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రాసిన లేఖను ఏపీ భవన్ అధికారులు ప్రధాన మంత్రి కార్యాలయానికి అందజేశారు. తిత్లీ తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఏపీ ఉన్నత అధికారి వరప్రసాద్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ సోమవారం ప్రధాన మంత్రి కార్యాలయంలోని కేబినెట్ సెక్రటరీ పీకె సిన్హా, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న జాయింట్ సెక్రటరీ దేవిశ్రీ ముఖర్జీలను, అలాగే హోం సెక్రటరీ సంజీవ్‌లను కలిసి తిత్లీ తుపాను తరువాత పరిస్థితులు, ఏపీ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వారికి వివరించారు. తిత్లీ తుపాను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణ సాయం కింద రూ.1200 కోట్లను విడుదల చేయాలని, ఈ నష్టం అంచనా వేసేందుకుగాను తక్షణమే కేంద్ర బృందాలను ఏపీకి పంపాలను ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతంలో 50వేల ఇళ్లు ధ్వసంమయ్యాయని, తాగునీటి వనరులు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 2.25 లక్షల కుంటుంబాలకు సహాయ, పునరావాస కార్యక్రమాలను అమలు చేసేందుకు వెంటనే కేంద్రం సాయం ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. 1,802 గ్రామల్లో విద్యుత్ వ్యవస్థ పుర్తిగా దెబ్బతిన్నదని, 1.65 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 40వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు బాగా నష్టపోయినట్టు లేఖలో వివరించారు.