జాతీయ వార్తలు

అనిల్‌కే మోదీ కాపలాదారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, అక్టోబర్ 22:ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చౌకీదారు కాదని, పారిశ్రామిక అంబానీకే కాపలాదారు అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన రాహుల్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసిన మెహుల్ చోక్సీ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. బెదిరింపులు, అణచివేత హెచ్చరికల కారణంగానే మీడియా ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు 30వేల కోట్ల రూపాయల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేశారని, వీరిలో చోక్సీ అరుణ్ జైట్లీ కుమార్తె బ్యాంకు ఖాతాల్లోకి లక్షలాది రూపాయలు జమ చేశారని రాహుల్ ఆరోపించారు. చోక్సీపై ఆర్థిక మంత్రి జైట్లీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్లే ఆయన దేశం వదిలి పారిపోయాడన్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జైట్లీ కుమార్తె బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించారని రాహుల్ గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ప్రధాన మీడియా సంస్థలేవీ ఈ కథనాన్ని ప్రసారం చేయలేదని అన్నారు. మీడియా ప్రధాన బాధ్యత వాస్తవాలను వెలుగులోకి తేవడమేనని తెలిపారు. సరిహద్దులను సైనికులు కాపలా కాస్తున్నట్టుగానే మీడియా కూడా నిజాన్ని పరిరక్షించాలన్నారు. మళ్లీ రాఫెల్ అంశాన్ని అందిపుచ్చుకుని ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌కు దక్కాల్సిన ఈ కాంట్రాక్టును విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని ఓ ప్రైవేటు కంపెనీకి మోదీ అప్పగించారని రాహుల్ విమర్శించారు. మొత్తం 126 రాఫెల్ విమానాల కొనుగోలుకు అప్పటి యుపీఏ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, ఒక్కో విమానం ధరను 526 కోట్లుగా నిర్ణయించిందన్నారు.