జాతీయ వార్తలు

ఫలవంతమైన చర్చలకు తెర తీద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు భుజం భుజం కలిపి విస్తృతమైన చర్చల ద్వారా ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమావేశాల్లో తీసుకోవటం ద్వారా దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం చేయాలని ఆయన అన్నారు. దేశానికి 70వ స్వాతంత్య్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందు జరుగుతున్న ఈ సమావేశాలు గుణాత్మకమైన చర్చలతో సత్ఫలితాలనిస్తాయని ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ‘‘మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే దేశం అభివృద్ధిపథంలో వేగంగా ముందుకు వెళ్లగలుగుతుంది. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా, భుజం భుజం కలిపి పనిచేసి దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జీఎస్‌టి బిల్లుకు ఈ సమావేశాల్లో రాజ్యసభ ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉంది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో పలుమార్లు సీనియర్ మంత్రులు మంతనాలు జరిపారు. అయినప్పటికీ అరుణాచల్‌ప్రదేశ్‌పై సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రధాన ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధమై ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి పౌరస్మృతి ప్రవేశపెట్టడంపై నివేదిక ఇవ్వాల్సిందిగా లా కమిషన్‌ను ప్రభుత్వం కోరటంపైనా ఈ సమావేశాల్లో గందరగోళం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిత్రం.. పార్లమెంటు వెలుపల విలేఖరులతో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ.
చిత్రంలో కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఎస్.ఎస్. ఆహ్లూవాలియా, జితేందర్ సింగ్ తదితరులు