జాతీయ వార్తలు

ఇదేనా పద్ధతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: కొందరు న్యాయాధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను రోడ్డుకీడ్చి పరిస్థితులను విషపూరితం చేశారని దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణకు చెందిన కొందరు న్యాయాధికారులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలకు దిగడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన జరిగిపోయిన నేపథ్యంలో, ఇకమీదట విద్వేషాలు పెంచకుండా సంయమనంతో మసలుకోవాలని హితవు పలికింది. న్యాయాధికారుల కేటాయింపులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర అడ్వైజరీ కమిటీ ద్వారా న్యాయాధికారుల నియామకాలు చేపట్టాలని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటీషన్లపై సోమవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంలో తెలంగాణ న్యాయాధికారులకు న్యాయం జరిగేలా చూస్తామని సుప్రీంకోర్టు స్పష్టమైన హామీ ఇచ్చింది. పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ ఖన్‌విల్కర్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. న్యాయాధికారుల నియామకాల అంశంపై కేంద్రం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇదిలావుంటే, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ కేంద్రం ఓ సలహా కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా న్యాయాధికారుల నియామకాలు చేపట్టాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగినందున న్యాయ వ్యవస్థను సైతం విభజించాలన్నారు. ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తోన్న సమయంలోనే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఏం చేసినా నిబంధనల ప్రకారమే చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రం తరఫున అదనపు సొలిసిటరీ జనరల్ మణిందర్ సింగ్ జోక్యం వాదనలు వినిపిస్తూ కేంద్రం ఒక సిఫార్స్ ఇచ్చిందని, దాని ఆధారంగానే సచివాలయ ఉద్యోగుల పంపకం జరిగిందని గుర్తు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని, ఆ వాదనకు అర్థమేమిటని ప్రశ్నించారు. ఇదే సమయంలో కేంద్ర సలహా కమిటీ ఏర్పాటు చేసినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం కోర్టుకు తెలిపింది. హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ద్యారా ఆప్షన్లు ఇచ్చి న్యాయాధికారుల నియామకాలు చేపట్టారని, అందులో ఆంధ్రకు చెందిన న్యాయాధికారులు ఎక్కువగా తెలంగాణను ఎంచుకున్నారని కోర్టుకు తెలిపారు. దీనిమూలంగానే న్యాయాధికారులు ఆందోళన చేపట్టారని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ధర్నాలు చేశారని వ్యాఖ్యానించింది. ధర్మాలు, నిరసనలతో పరిస్థితిని విషపూరితంగా మార్చేశారని అభిప్రాయపడింది. తెలంగాణకు అన్యాయం జరగాలన్నది తమ అభిమతం కాదంటూనే, తెలంగాణ ప్రాంత న్యాయధికారుల ప్రయోజనాలు కాపాడతామని హామీ ఇచ్చింది. సమస్య పరిష్కారానికి కేంద్రం సైతం సహకరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున హరీష్ రావల్ వాదనలు వినిపిస్తూ కేంద్ర సలహా కమిటీ ఏర్పాటు చేసి న్యాయాధికారుల కేటాయింపు చేపట్టాలని, ఈ విషయంలో హైకోర్టుకు అధికారం లేదన్న విషయం విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంటూ, నాలుగు వారాలకు విచారణను వాయిదా వేసింది.