జాతీయ వార్తలు

మరో ప్రయోగానికి ఇస్రో సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 8: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో సమాచార ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి ఈ 14న జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-డీ 2 ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఈ రాకెట్ ద్వారా 3600కిలోల బరువుగల జీశాట్-29 సమాచార ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. రాకెట్‌ను వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌లో (వ్యాబ్) అనుసంధానంతరం బుధవారం రెండో ప్రయోగ వేదికకు తరలించారు. అక్కడ వివిధ పరీక్షలనంతరం రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేస్తారు. ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) ఈ 12న నిర్వహించనున్నట్లు తెలిసింది. అదే రోజు లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్‌ఏబి) వారు కూడా సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలపనున్నారు. దేశంలో సమాచార
సాంకేతిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇస్రో జీశాట్-29 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. గత ఏడాది ప్రయోగించిన జీశాట్-19 ఉపగ్రహంతో ఇప్పటికే కమ్యూనికేషన్ సేవలు అందుతున్నాయి. దానితో అనుసంధానం చేసి కమ్యూనికేషన్ రంగంలో కొత్తపుంతలు తెచ్చి సేవలను విస్తృతం పరచడమే కాకుండా ఇస్రో ప్రయోగించే జీశాట్-29 ఉపగ్రహంతో అదనపు ప్రయోజనం సమకూరనుంది.

చిత్రం..జీశాట్-29 ఉపగ్రహం