జాతీయ వార్తలు

ఉరకలేస్తున్న బీఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తామని, మంచి సీట్లు వస్తాయని బహుజన సమాజ్ పార్టీ ఆశలు పెట్టుకుంది. బీఎస్పీ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నెల 28వతేదీన జరిగే ఎన్నికల్లో తమకు 32 సీట్లు వస్తాయని బీఎస్పీ ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. దాదాపు 75 సీట్లలో దళిత, ఓటర్లు 20 శాతంపైగా ఉన్నారు. 1993, 1998 ఎన్నికల్లో బీఎస్పీ 11 సీట్లు, 2003లో రెండు సీట్లు, 2008లో ఏడు సీట్లు, 2013 ఎన్నికల్లో నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంది. బీఎస్పీని తక్కువగా అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే రాజకీయంగా గట్టి పోటీ నెలకొని ఉంది. కాని ఈ సారి మాత్రం బీఎస్పీ భారీ ఎత్తున ఓట్లు చీల్చుకుని గణనీయంగా సీట్లను తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ అహ్రివార్ చెప్పారు. ఈ సారి ఏ పార్టీకి కూడా మెజార్టీ రాదు. ప్రజలు గంపగుత్తగా ఏ పార్టీని పూర్తి మెజార్టీ ఇవ్వరు. ప్రభుత్వం ఏర్పాటుల్లో బీఎస్పీ క్రియాశీల పాత్ర వహిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 18, 26 తేదీల్లో మాయావతి అతి పెద్ద ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవా, చంబల్ డివిజన్లు, భోపాల్, మహాకోశల్ ప్రాంతంలో మాయావతి ప్రసంగించేందుకు వీలుగా ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడం మేలని, కాంగ్రెస్‌తో పొత్తు వల్ల తమ పార్టీ ఎదగదని ఆయన చెప్పారు. అందుకే మాయావతి గట్టి నిర్ణయం తీసుకుని పొత్తులు లేకుండా ఒంటరి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రదీప్ అహిర్‌వార్ చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీఎస్పీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన విషయం విదితమే. గత అసెంబ్లీ ఎన్నికలను విశే్లషిస్తే మొరేనా, రేవా, సాత్నా, దాటియి, గ్వాలియార్ జిల్లాల్లో బీఎస్పీ బలంగా ఉంది. ఈ సారి చత్రాపూర్, పాన్నా, శివపురి, షియోపూర్, దామోహ్, కాట్ని, బాలాఘాట్, సింగ్రౌలి జిల్లాల్లో పార్టీ గెలుపు ఖాతాలను ప్రారంభిస్తుందని బీఎస్పీ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. బీఎస్పీకి 2008లో 8.97 శాతం, 2013లో 6.29 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ ప్రభుత్వం తీరుతో ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, గత ఏడాది పిపాలియా మండి, మందాసౌర్ ప్రాంతాల్లో రైతుల ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. ఈ ఉద్యమంలో బీఎస్పీ చురుకుగా పాల్గొంది. రాష్ట్రంలో తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఉందని, వ్యాపం స్కాం, రిక్రూట్‌మంట్ రాకెట్‌లతో బీజేపీ సర్కార్ అప్రతిష్టపాలైందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 165 సీట్లు, కాంగ్రెస్‌కు 58 సీట్లు వచ్చాయి. బీజేపీకి 44.48 శాతం, కాంగ్రెస్ పార్టీకి 36.38 శాతం ఓట్లు వచ్చాయి.